చరిత్రకెక్కని వింత.....నల్లమలలో ఓ మృతనగరం

వేయి గడపల మహాపట్టణం
రాజులకు కోట - ప్రజలకు పేట
మూలమూలకో తాగునీటి బావి
8 అడుగుల పొడవైన సమాధులు


నల్లమల ఎప్పుడూ వింత లు, విశేషాల భాండాగారమే. ప్రపంచంలోనే ఎన్నదగ్గ జీవవైవిధ్యానికి ఈ అడవులు ప్రతీకలు. పురా తన ఆలయాలకు ఆలవాలం. రాజుల,దొంగల కోట లకు కూడా ఇది నెలవే. ఐదు జిల్లాల్లో ఆవరించి వున్న ఈ నల్లమల మహారణ్యంలో నాగరిక సమా జానికి అతిదగ్గరలో ఎప్పటిదో ఓ చరిత్ర సజీవ సమాధి అయింది. ఈ విషయం బయటి ప్రపంచా నికి అంతగా తెలియక పోవడానికి కారణమేమో అర్థం కాదు.


కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీ డివి జన్‌లోని నాగలూటి చెంచుగూడేం సమీపంలో వున్న ముర్తుజావలి దర్గాకు ఈశాన్యంలో ఓ మహా పట్టణం కాలగర్భంలో కలిసిపోయిన విషయం బయటి ప్రపంచానికి తెలియకుండానే పోయింది. లోతైన కందకం, ఆపై విశాలమైన కోట ప్రహరీ, ఎత్తైన బురుజులు, కోటలో పునాదిమట్టమైపోయిన శిథిలాలు, పురాతన ఆనవాళ్లు ఇప్పటికీ దర్శన మిస్తూ మనకు తెలియకుండా పోయిన ఒకనాటి సంస్కృతిని, చరిత్రను వెల్లడిస్తూ మెదడుకు మేత ను పెడుతున్నాయి. స్థానికంగా ఉన్న గిరిజనులు, 400 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వెలసిన ముర్తుజావలి దర్గా ముజావర్లు తెలిపిన వివరాల మేరకు ఈ శిథిల నగరం జాడను కాస్త పసిగట్టే వీలు కలుగుతోంది.
వెయ్యేళ్లకు పైమాటే.

భూగోళానికి నాభిస్థానంలో ఉందని స్కందపురాణంలో చెప్పబడిన మహాపుణ్య క్షేత్రం శ్రీశైలం. శ్రీగిరికి వెళ్లే దారిలో ఈ మృతనగ రం చైతన్యవంతమై ఉండినట్లు తెలుస్తోంది. ఈ నగరంలో 3వందల గడపతో వేశ్యావాటిక ఉండే దని వయోవృద్ధులు తమకు మౌఖికంగా అందిన సమాచారం మేరకు పేర్కొంటున్నారు. అంటే కనీసం 30వేల జనాభా నివసించిన మహాపట్టణ మేదో అక్కడ ఉండిఉండేదన్న ఆనవాళ్లు ఇప్పటి కింకా కనిపిస్తున్నాయి.

రాజులకు కోట - ప్రజలకు పేట

ఈపట్టణం కోట లోపలిభాగం, బయటిభాగంగా రెండుగా కనిపిస్తోంది. లోతైన కోట కందకం, దాని పక్కనే ఎత్తైన కోట గోడ ఇప్పటికీ మనకు మట్టి దిబ్బలుగా కనిపిస్తాయి. అప్పట్లో సైనిక పహరా కో సం నిర్మించిన రెండు బురుజులు కూడా నేడు మట్టి దిబ్బల్లా దర్శనమిస్తాయి. రాజులు నివసించిన కోట సమీపంలో ప్రత్యేకమైన స్మశానవాటిక కూడా కనిపిస్తోంది. ఇందులోని సమాధులు సుమారు 8 -10అడుగులకుపైగానే పొడుగుండటం విస్మయాన్ని కలిగిస్తోంది. కోటలోకనిపించే పునాధులు పొడవుగా వుండి విశాలమైన భవనాల ఆనవాళ్లను మనకు స్పష్టం చేస్తున్నాయి. కోటవెలుపల విశాలమైన ప్రాంతంలో ఎన్నో నివాసగృహాల పునాధులు కనిపి స్తున్నాయి. వీటిలో నాడు అక్కడ జీవించిన ప్రజల స్థితిగతుల వ్యత్యాసాలను స్పష్టంగా మనం గమ నించవచ్చు.


మూలమూలకో బావి

శిథిలమైపోయిందని చెప్పబడుతున్న ఈ మృత నగరంచుట్టూ అందుబాటులో ఎన్నో ఊట బావులు కనిపిస్తాయి. వీటి నిర్మాణపు రాతి కట్టడం ఇప్పటికీ కూడా చెక్కుచెదరకుండా ఉంది. లోతు తక్కువైన ప్పటికీ ఇప్పటికీ కొన్ని బావుల్లో నీరు కనిపిస్తోంది. మరికొన్ని మోటబావులుగా ఉన్నాయి. అంటే ఈ బావుల నీటిని వ్యవసాయానికి కూడా ఉపయోగిం చినట్లు అర్థమవుతోంది. ఇప్పటికీ ఈ బావులు వన్యప్రాణుల దాహార్థిని తీరుస్తుండటం విశేషం.


పురాతన నాణేలు లభ్యం

కోట ప్రాంతంలో ఇప్పటికీ గిరిజనులు వర్షం పడ ితే వెతుకులాటకు బయలుదేరుతారు. ఈ వెతుకు లాటలో వారికి రకరకాల నాణేలు లభ్యమవుతుం టాయి. కొన్నిసార్లు బంగారు నాణేలు కూడా లభ్య మయ్యాయని అంటుంటారు. కాని వాటికి తగిన ఆధారాలు లేవు. ఈ ప్రాంతంలో లభ్యమైన రాగి నాణేలు కొన్ని ముర్తుజావలి దర్గా ముజావర్‌ సయ్య ద్‌గౌస్‌పీరా వద్ద ఉన్నాయి. అలాగే వర్షం పడ్డప్పుడు కోట ప్రాంతంలో రకరకాల రంగురాళ్లు కూడా గిరి జనులకు లభ్యమవుతున్నాయి.

శిథిలాలయాలు సమాహారం

నాగలూటి సమీపంలో ఉన్న కోట ప్రాంతంలో అనేక శిథిల ఆలయాల ఆనవాళ్లు కనిపిస్తాయి. విరిగిపోయిన నందులు, దక్షిణామూర్తి, మహిషాసు రమర్ధిని వంటి దేవతా విగ్రహాలు కూడా అక్కడ క్కడా కనిపిస్తాయి. ఈ కోట ప్రాంతమంతా రాతి రోళ్లు కనబడుతూ మానవ ఆవాసాన్ని గుర్తు చేస్తు న్నాయి. గతంలో ఎప్పుడో ఈ శిథిల కోటలోని ఓ ప్రాంతంలో ఆలయ ప్రాంగణంలోని రెండు ఎనుగు విగ్రహాలను ఆత్మకూరు పట్టణంలోని శ్రీ కోందడరా మాలయ ముఖద్వారానికి ఇరువైపులా ప్రతిష్టించి నట్లు తెలుస్తోంది. అడవిలోని నగరం శిథిలమై పోగా సమీపంలో ఉన్న ఆత్మకూరు, వెలుగోడుకు ప్రజలు వలస వచ్చిన సూచనలున్నాయి. వెలుగోడు పట్టణంలో పూర్వం వేశ్యా వృత్తి అవలంభించిన ఓ సామాజిక వర్గం జనాభా అధికంగానే ఉండటం మృతనగరం నుంచి వలసలు జరిగాయన్న అంశాన్ని బలపరుస్తుంది


సిద్దాపురమే..శిథిల నగరం..!

నల్లమలలో శిథిలమైన నగరం పేరు సిద్దా పురమని గడిచిన శతాబ్ద కాలం కిందటి కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి. సరిగ్గా 110 ఏళ్ల కిందట రాZషంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న నేరగాళ్లను అప్పటి తెల్లదొరల ప్రభుత్వం పరివర్తన దిశగా పునరావాస గ్రామాల్లో ఆవాసం కల్పించింది. అందులో భాగంగా ఆత్మకూరు సమీపంలో వున్న సిద్దాపురం అనేగ్రామాన్ని ఏర్పాటుచేసింది. అయితే ఈ గ్రామాన్ని మొదట కేవలం సెటిల్‌మెంట్‌గానే వ్యవహరించేవారు. వీరిని వ్యవసాయ వృత్తిలో దించేందుకు సమీపంలో బ్రిటీష్‌ ప్రభుత్వం చెరువు నిర్మాణం చేపట్టింది.

ఈ చెరువు రివిట్‌మెంట్‌ కోసం అవసరమైన రాళ్లను నాగలూటి ప్రాంతంలో శిథిలమైన పట్టణం నుంచి తరలించినట్లు వయోవృ ద్ధులు చెబుతున్నారు. అందుకే ఈ శిథిల పట్టణం లో మట్టిదిబ్బలే తప్ప రాతి కట్టడాలు కనిపించవు. అప్పట్లో ఈ రాళ్ల తరలింపును ముర్తుజావలి దర్గా ముజావర్‌ ఒకరు ఆక్షేపించినట్లు తెలుస్తోంది. ఆయ నను ప్రసన్నం చేసుకోవడానికి అప్పటి అధికారులు నిర్మాణమవుతున్న చెరువులోని చేపలపై అధికారం ఇచ్చినట్లు వారి వారసుల వల్ల తెలుస్తోంది.


ఇప్పటికి ఈ ముజావర్ల వంశంలో కొందరి ఇంటిపేర్లు చేపల పేరుతో ఉండటం గమనార్హం. సెటిల్‌మెం ట్‌గా వున్న గ్రామాన్ని తాము రాళ్లు తెచ్చిన శిథిల పట్టణం సిద్దాపురం పేరునే అప్పటి బ్రిటీష్‌ అధి కారులు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రాళ్లన్నింటిని తరలించడంతో కోట గోడ, బురుజులు ప్రస్తుతం మట్టిదిబ్బలుగా మిగిలాయి. అలాగే కోటలోనూ, పేటలోనూ ఏ ఇంటి గోడలు కూడా కనిపించవు. కేవలం వాటి పునాదులు మాత్రమే ఇప్పటికీ గోచర మవుతాయి.

పురావస్తు శాఖ దృష్టి పడని మరుగున పడ్డ చరిత్ర

నల్లమలలోని ఆత్మకూరు అటవీ డివిజన్‌ పరిధిలో ఉన్న మృతనగరం సిద్దాపురంపై పురా వస్తు శాఖ దృష్టికి రాకపోవడంతో ఎంతో చరిత్ర మరుగున పడ్డట్లైంది. 8అడుగులపైగా వున్న సమా దులను తవ్వితే సిద్దాపురం ఏనాటిదో తెలుస్తుంది. ఇక్కడ దొరికిన రాగి నాణేలపైఉన్న లిపి గత చరి త్రను స్పష్టం చేయవచ్చు. అతిపురాతన మార్గమేదో నాగలూటి ప్రాంతంలోఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి కైనా మరుగున పడ్డ చరిత్రను వెలికి తీసేందుకు పురావస్తు శాఖ నడుంబిగించాల్సి ఉంది.

ఇది సంవత్సరం క్రిందట 'వార్త'లో వచ్చిన విశేష విషయం...

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!