చదరంగం....

చిన్న కోడలు శ్రావణి అంటే అత్తగారికి ఆపేక్ష ఎక్కువే.. ఉండేది హైదరాబాదులో అయినా వీలైనంత వరకు ప్రతి పండగ అత్తగారింట్లో నే జరుపుకునే శ్రావణి ప్రత్యేకం అందరికీ...
అత్తగారింట్లో  ఓర్పు ,నేర్పు,సహనం,శాంతం  అన్ని సద్గుణాలు కలిగిన కోడలుగా పేరు తెచ్చుకుంది..

అందరూ అభిమానించే  చిన్నకోడలు శ్రావణి  తనకు మాత్రం ఎందుకో తన తెలివితేటలతో అందర్నీ నమ్మిస్తూ నట్టుగా అనిపిస్తుంది..  అందరూ అభిమానించే శ్రావణి ని  తను ఎందుకు అభిమానించే లేకపోతున్నా డో మనసుకు తెలియడం లేదు..తనకు అలా అనిపించడానికి ఆమె చేసిన తప్పు కూడా ఏమీ లేదు... అని తనలో తను మథన పడ్డాడు  రఘునాథ్...

అనుకోకుండా హైదరాబాదులో ఆఫీస్ పని మీద రెండు నెలలు ఉండాల్సిన అవసరం వచ్చింది.., భార్య కు రావడం కుదరకపోవడంతో, ఒక్కడే బయల్దేరాడు రఘునాథ్ .. చిన్న కొడుకు ఇల్లు అనుకున్న దానికంటే ఎంతో నేర్పుగా తీర్చిదిద్దినట్లు ఉండడం చూసి ఒకింత ఆశ్చర్యపోయాడు..

రఘునాథ్ కి కావాల్సినట్టుగా టిఫిన్ కాఫీ సమయానికి అందించడం, భోజనానికి తనకి ఇష్టమైనవి ఉండడం అన్ని పనులు ఖచ్చితమైన సమయానికి చేసే శ్రావణి ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరు స్తూ నే ఉంది...

ఒకరోజు సాయంత్రం శ్రావణి టీ పెట్టీ ఇచ్చే సమయం మించిపోవడంతో...ఏమ్మా శ్రావణి ఇంత ఆలస్యంగా అయింది అన్నాడు చిరునవ్వుతో రఘునాథ్..

అప్పటి వరకు అతను మౌనాన్నే తప్ప చిరునవ్వుని చూడని శ్రావణి కి ఇది ఎనిమిదవ వింతే అయింది... అపుడు అనిపించింది..చక్కర డబ్బా స్థానం లో ఉప్పు ఎలా వచ్చిందో.... తరచు డబ్బాలు మారడానికి కారణం ఏమిటో....మామగారు తనతో ఆడే చదరంగం ఆటవింతగా అనిపించింది శ్రావణి కి... ఆట కు కారణం కూడా వెతకడం మొదలెట్టింది....

అన్ని పనులు ఆమె చేసుకోగలిగిన కూడా చిన్న చిన్న పనులు మావయ్యకు చెప్పడం. అతని చిన్న చిన్న ఇష్టాలు గుర్తించడం...

పనిని గమనిస్తూ చేయడం తగ్గి మనిషిని గమనిస్తూ పనులు చేయడం ...క్రమేపీ అతి చిన్న మార్పులు ఎన్నో చేరాయి తను చేసే పనుల్లో..

మెల్లిగా రోజులు గడిచేకొద్దీ ఆటలోని పటుత్వం తగ్గుతూ తగ్గుతూ క్రమేణా ఆట ఆగిపోయింది...

రఘునాథ్ ఊరికి బయలుదేరుతూ అమ్మాయి శ్రావణి నీతో ఒక మాట చెప్పాలి తల్లి అన్నాడు ... మీరు చెప్పాల్సిన మాట నాకు అర్థమైంది మామయ్య...అందరికీ  నాలో నేర్పు,సహనం కనిపిస్తే .... నాకు తెలియని నాలోని యాంత్రికత మీ ఆటకు పునాది కాబోలు అంది...

నిజమే నీవు చేసే ప్రతి పని ఎంతో ఆశ్చర్యంగా ఉండేది ఖచ్చితమైన సమయానికి ఎంతో ఓర్పుతో చేసే నీ పనులకు వంక పెట్టడానికి వీలులేదు అయినా ఎందుకో నీవు నాకు అందించే ప్రతి దానిలో అభిమానం . కనిపించినట్లుగా ఉండేది కాదు .. అందుకు కారణాన్ని అన్వేషిస్తూ ..  ఇదిగో ఈ చదరంగం ఆట మొదలెట్టా ను.....అయినా ఆటలో ఎప్పుడు నీవు మొదటి శ్రేణిలోనే ఉన్నావమ్మా... అప్పుడు ఇప్పుడు కూడా గెలుపు నీడేనమ్మా అంటూ చిరునవ్వుతో ఆశీర్వదించాడు శ్రావణిని....


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!