నోటు పుస్తకం

అర్ధరాత్రి దాటుతున్నా ఎందుకో నిదుర రావట్లేదు ఈమధ్య...జీవితం ఎందుకో ఉల్లాసంగా, ఉద్వేగంగా అనిపించడం లేదు.. ఒకలాంటి విరక్తి, జీవితం చాలు అనుకున్నాడు అతను... తను రాయలసిన ఉత్తరం రాసి అమ్మ అందుకునే చోటు నగల లాకర్ లో పెట్టడానికి చూస్తే అందులో నాలుగు నోటుపుస్తకాలు కనిపించాయి.. అందులో అమ్మ చేతిలో కనిపించే ఎర్ర అట్ట పుస్తకం ఆశక్తి రేకిత్తించింది.

తీసి చదవడం మొదలెట్టాడు... నేనంటే మా టీచర్ కి చాలా ఇష్టం నువ్వు ఉంటే నీ చుట్టూ పిల్లలు అందరూ తెలివైన వాళ్ళు అయ్యేదాకా వదిలిపెట్టావా అంది లెక్కల టీచర్ (అవును వాడికి తెలిసింది అందరికీ రావాలని ఆరాటపడతాడు. ఆ విషయం ఇంకొకరు గుర్తించేంతగా మా వాడు ఎదిగాడు ఎంత గర్వంగా ఉందో) తేదీ చూశాడు అపుడు తను నాలుగవ తరగతి..

ఇంకోచోట అందరికీ అందించడమే తప్ప అందుకోవడం ఎప్పుడు నేర్చుకుంటావు రా... అన్నాడు తన ఫ్రెండ్ ప్రసాదు

మరోచోట ఎందరికో నువ్వు అంటే .. ఇష్టం మరి నీకు అడిగింది ప్రశ్నలో జవాబు వెతుకుతూ... ఇలా ఎన్నో తను గుర్తించనివి, మరిచిపోయినవి అన్నిటిలో ఆనాటి సంఘటన, అమ్మ అభిప్రాయంతో కలిపి ఉన్నాయి... చదివాక ఆలోచనలో పడ్డాడు....

తను రాసిన ఉత్తరం మొదటి పేజీలో పెట్టి .... దాని మీద ఎర్ర పెన్నుతో THANKYOU అని వ్రాసి యధాస్థానంలో పెట్టి నిశ్చింతగా నిదురపోయాడు.

లేవగానే చెట్లను తడుపుతున్న అమ్మను వెతుక్కుంటూ వెళ్ళి కొన్ని రోజులు మనం ఏదైనా టూర్ వెళదామా అని అడిగాడు... ఏవి చూడాలనుకున్నావో చెప్పడం నీ వంతు ..నీతో రావడం నా వంతు “నచ్చితేనే” అంది చిన్న నవ్వుతో .....

 వెళుతున్న అతన్ని చూస్తూ నా నోటుబుక్ అనుకుంది....

 

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!