ఊపరాడని నన్ను

ఈరోజు ఉంటాను
రేపు ఉంటాను
ఎల్లుండి కూడా ఉంటాను
ఎంత ధైర్యం నాకు
ఎప్పటికీ ఇక్కడే ఉంటానని...

మాట్లాడమని
మాట మాటకు అడుగుతాను...
మరీ మరీ అడుగుతాను ..

గడియ వేసిన చోట
దారి వెతుకుతాను
నీ మౌనంలోని మాటలు
నాకు తెలుసంటాను...

ఓయ్
సంద్రమై రారాదు
అల్లకల్లోలం సృష్టించే
తుఫానై చుట్టి వేయరాదు

విధ్వంసం అయితేనేమి
గాయలై  అణువణువు
అల్లుకుంటుంది కదా

ఊపరాడని నన్ను ...
మరింత చిక్కగా
నీలో చిక్కుకుపోనియ్.....


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!