సమయం కోరితే
అలవోకగా అందించేదెవరు...
సమయం లేదంటూ
తప్పుకుపోయే వారే అందరూ..
అలాటి ఈవేళ
తనదైన సమయాన్ని
దోచుకున్నానేమోనని
మది మౌనంగా తల్లడిల్లె క్షణకాలం ...
సమయపు బందిఖానాలో
చిక్కుకున్న ఒక గూటి పక్షులమేనేమో...
అరుదైన రంగులు జల్లి
సమయాన్ని సమంగా
పంచుకున్నామని తెలిసింది ...
ఇరువురి మధ్యన
కాస్త సమన్వయం కుదిరాక...
అనంతమైన సమయం
నదిలా ప్రవహించింది
ఇరువురి మధ్యన
లతలా అల్లుకుంటూ...
సమయం రారాజని ఎవరన్నారోయ్
సమయం నా చెంత చేరి
నేస్తమయ్యింది ఈవేళ...