రాజకుమారా

తీపి మాటల బాల్యం గుర్తుందా
ఎదురైన స్నేహితులు గుర్తున్నారా
కలబోసి ఆడుకున్న ఆటలు గుర్తున్నాయా...

ఇంతకూ
మొదటిసారి నాతో మాట్లాడిన మాట గుర్తుందా
పలకక వెనుదిరిగిన అప్పటి నేను గుర్తున్నానా...
పలవరిస్తూ పంతం పట్టే ఇప్పటి నేను గుర్తున్నానా...
గుర్తుపెట్టుకోలేనంతగా నీలో నన్ను కలుపుకున్నావా...

ఏదో ఒకటి మాట్లాడు రాజకుమారా....
ప్రశ్నలు...ఎనలేని జవాబులు  నావే అయితే ఎలా...
చిరునవ్వుల జవాబుల కాలం తీరిపోయింది..
ఇక కాళీ ...మహాకాళి.. రుద్రకాళి అని
ఏవో ఒక రూపు దాల్చడం ఖాయం మరి

ఓయ్
అయినా....
సోగకన్నుల శివుడికి జతగాడివే కాబోలు
నా సమయమే నీకు చిక్కుపడిపోతుంది ...
మంచులా కరిగి నీరై నీ జంట చేరిపోతానేమో..
నిజం చెప్పు ...నువ్వు నా నుంచి
కొంచెం ప్రేమను దొంగిలించావు కదూ...


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!