I scared ...
Really? new path created?
అతనికై రోజు నడిచే తోవే కదా
సమయంతో పని లేకుండా అతన్ని
ఒడిసిపట్టే చతురుత ఉన్నదాన్నే కదా..
అయినా
అతను తెలుసు తెలుసంటూ
నన్ను తప్పుకు పోలేవంటూ
హోరెత్తి చెప్పే మనసుకు
కొత్తటి బెరుకు వచ్చి చేరింది...
తెలిసిన దారిలో నడవని సమయం
మాట కలపని సమయం కలిసి
నాకు తెలియని చీకటి సొరంగం ఒకటి
అగాధాలను ఒడిసిపట్టి సృష్టించినట్టుంది
కనిపించే దూరంలో అతను ఉన్నా
కనపడలేదంటూ కళ్ళు వాలుస్తోంది
దారి మరిచానంటూ అబద్ధం ఆడుతోంది
ఈవేళ ... ఎందుకో
బెంగటిల్లే మనసుకి
కొత్తటి బెరుకొకటి మేరువై నిలిచింది...