కాలం తీర్పు

అప్పుడప్పుడు
ఒక ముళ్ళమొక్క గుచ్చుతుంది
అది నేను కోరి నాటిన మొక్క కాదు..

ఎప్పుడో
నే నాటిన పూలమొక్కల మధ్యన
ఒదిగి ఒదిగి ఎప్పుడో పెరిగిపోయింది
విసురుగా పెరికి పారేయలేను
జాలితో అక్కున చేర్చుకోలేను లేను

అయితేనేం
అది ఓ పచ్చని మొక్క
ఒదిగి ఒదిగి ఎదుగుతోంది
మా పూలమొక్కల మధ్య
నాది కానీ ఓ మొక్క....

ఏమో ఎవరు చెప్పారు కాలం తీర్పు
ముళ్ళ మొక్క పూలు పూస్తుందేమో


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!