తెల్లారింది మొదలు
వీధి చివరి వరకు చూపు సారిస్తానా
వీధి అంచున ఆటోమలుపు ఇటోమలుపు
ఎక్కడా అతను వస్తున్న జాడలేదు...
లోనికి వస్తూ అంటాను కదా
మబ్బుమబ్బుగా ఉంది
ఇంకా తెల్లారినట్టు లేదు..
ఓయ్
అనాల్సిన ఇంకో మాట
మనసు అంచు నుంచి దాటి రాదే....