ఎందుకోయ్.... అనుమతి

సమయం నా చేతి
కదలికల మధ్యన దాగిపోతుంది....

అయినా
నీ ఆనవాలు నా కంట పడకుండా
చేజారిపోవని ఎంత నమ్మకమో..

నీ అడుగు నా వైపు చేరకముందే
నీ కలల రంగుల దారం ఒకటి
నా చిటికెన వేలుకు చుట్టుకుందోయ్ ...

ఇపుడు
నీ రంగుల కలలతో
కథలల్లు కుంటుంటాను..
నీవు ఎక్కడ ఉన్నా
నాచెంత బందీవే కదా..

ఎప్పుడు చెప్పేది
మరుపుకు రాకుండా
మరీ మరీ చెబుతున్నా...

ఆకాశం అంత ప్రేమించడానికి
నీ అనుమతి ఎందుకోయ్


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!