ఒకసారి గిల్లి చూడనా

తెల్లవారకముందే ఎదురయ్యాడు
ఓంకారనాదమేదో గొంతున పట్టి
తెచ్చినట్టు పలకరించాడు..
చేయి పట్టుకుని
మానససరోవరానికి దారి వేశాడు

రెప్పపాటు కాలంలో
నాదైనా దారులన్నీ మరిచిపోయాను
నాలో నుండి నేను తప్పిపోయాను

ఇపుడు
అతను ఎందుకో కొత్తగా ఉన్నాడు
ఆనవాలు అందడం లేదు
ఏ మబ్బుతునక అతన్ని ఆవహించిందో

ఓయ్
నువ్వే కదా ...
వచ్చింది నీవని తేల్చుకొన
ఒకసారి గిల్లి చూడనా
ఇదివరకు గిల్లిన గాటు చూడనా

చెప్పవోయ్.....
నువ్వు...
నా నువ్వే కదూ....❤️❤️


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!