అతని కోసమే

​సృష్టి మొదలు నుంచి ఎన్ని జన్మలెత్తానో
ఇప్పుడు నీకు ఎదురయ్యాను ..

మరెన్ని జన్మలెత్తాలో
నీవు నన్ను గుర్తించాలంటే..

*****

గదిని ముస్తాబు చేస్తూ
నీ జ్ఞాపకాలు పోగొట్టుకున్నాను ..

ఒకసారి రారాదు
మరో అద్భుతం సృష్టిద్దాం..

*****

చదరంగం ఆడడం మొదలు పెట్టాను
నాతో నేను .............
అయినా గెలుపు అతనిదెలా అయ్యిందో

,*****

 

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!