వదిలి వెళుతున్నానని
పదే పదే చెప్పబడింది
మౌనంగా ఒకసారి
మాటలతో ఒకసారి
యుద్ధకాంక్ష లేనిచోట
మది రణమేల సలుపు
మౌనంతో మది
మాటలకు నిలువలేక
విజయ చిహ్నం వదిలేసి
వెనుతిరిగింది నిశ్శబ్దంగా.....
ఇప్పుడు ఇక్కడ
యుద్ధము లేదు.. అపవాదు లేదు
అపజయము లేదు ... అనుబంధము లేదు..
అప్పుడప్పుడు
దిక్కుతోచని రహదారులపై
కొన్ని రాలిన జ్ఞాపకాలు
అపరిచితుల్లా
ఎదురవుతూ ఉంటాయి..
అనుకోకుండా....
కొన్నిసార్లు ..
సమయమే రారాజు