నాతో ఓ పరిచయ స్వరం

ఎక్కడికో నీ ప్రయాణం
పరిచయమైన స్వరం వినవచ్చింది

ఓ కొత్త మనిషిని వెతకడానికి
సరికొత్త దారులు వెతుకుతున్నా

నీ చెంత ఉన్నవారు సరిపోలేదా
పరిచయపు మాట పొడిగిస్తూ అంది

నా అనుకున్న వారి గురించి మాటలు
పంచుకోవడానికి ఒకరిని వెతుకుతున్నా
కాస్త నిక్కచ్చిగా చెప్పాను..

క్షణకాలం మౌనంవెనుక
ఆశ్చర్యంగా " నేను లేనా '
ఆసక్తితో మాట వినిపించింది

పక్కును నవ్వాను
నువ్వా...
నువ్వు మాట్లాడుతుంది
నీ కలలో  ' నాతో '

కలలా మారడం నీకు వచ్చు
కలను ఒడిసి పట్టడం నాకు రాదే
మౌనంగా కదిలిపోయాను...


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!