నువ్వు వస్తావు ..నా ఎదురుగా నిలిచి ..
నాకై మాటలు చెప్తానన్నావుగా
అని అడిగితే ఏమని చెప్పను....
నువ్వు ఎదురైతే
ఏడేడు సముద్రాలు కనిపిస్తాయి.....
అందులో నీ ఆనవాలు
వెతికే పనిలో అలసిపోతాను...
ఓ క్షణం.. నీ చూపు నా హృదయానికి
గాలం వేస్తుందనిపిస్తుంది..
అంతలోనే ఓ ప్రశ్న ఎదురైతుంది
అసలు అక్కడ హృదయము
మిగిలి ఉందా అని.....
నీ ఆనవాళ్లు ఒడిసి పట్టిన ప్రతిచోట
నా హృదయం కొంచెం కొంచెంగా కడిగి నీరైపోయింది....
ఎన్ని చోట్ల ఎన్ని ఆనవాలు వడిసిపట్టానో..
లెక్కా పత్రం రాయనే లేదు...
మరి ఇంకా హృదయం ముక్క
ఏదైనా మిగిలిఉంటుందా....
నీవొక గొప్ప జాలరివి ఓయ్...
సముద్రపు అలలపై తెలియాడే వేల పడవల్లో
నా అనవాలు ఒడిసిపడతావు....
సముద్రపు లోతుల్లో .. నీ చెంతచేరే
వలలోని చేపపిల్ల నేనే కదా..
అయినా ఎందుకో..
సముద్రపు అలల నురుగలా నీ ఒడిలో ఉన్నానని..
నాకు నేను అర్థం కాని ఓ సగానికి అర్థం నువ్వేనని ...
తెలిసినా...... తెలియనట్టు....
తెలిసింది అర్థం కానట్టు ..
నీకై నేను
దిగంతాల వరకు వెతుకుతూనే ఉన్నా
విసుగు విరామం లేకుండా
నీ వేల అడుగుల ఆనవాల కోసం..