సప్తమండలము సాక్షిగా

అతను వేచి ఉండమన్నాడు
కాసేపు వేచి ఉండమన్నాడు

వేచి ఉన్న సమయాన నా మనసు
అతను పెనవేసుకున్న జ్ఞాపకాలను
వెతికే పనిలో పడింది

అతనికై దాచుకున్న
ప్రేమ గీతాలను సరిదిద్దాను..

అతని కోసం రహస్యపు అరలోని
మాటలను తీసి ఉంచాను..

రాలిన పారిజాతాలను
అతనికై పరిచాను..

ఓ సమయాన....
గమనింపుకు వచ్చిన నా నీడలో
ఒదిగిన ఆనవాలు చూసి
వేచి ఉండడానికి అర్దమే లేదని
తలపుల లోగిలిలో నిల్చున్న
ఇదమిత్థంగా తేల్చుకోలేక ...

అయినా....
నా అడుగులో మౌనంగా ఓ సవ్వడి
అడుగు కలుపుతుందని
సప్త మండలము సాక్షిగా
మనసారా నమ్ముతూ..
నిశ్చలంగా వెనుదిరిగా నేను
'అతని '  నేను...


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!