ఒక్కసారి పరికించి చూడు.......
చిక్కని చీకటి
వెలుతురు చిమ్ముతుంది...
నీలి ఆకాశం నేల దిగివచ్చి
మెత్తని తివాచీ అయింది..
చుక్కలు ఒకటి ఒకటిగా
అతిథులుగా విచ్చేసి
నా చుట్టూ చేరి కబుర్లు
చెబుతున్నాయి...
అంతర్వాహిని ఒకటి
చప్పుడు చేయక
చెంత చేరింది ...
సీతాకోకచిలుకల గుంపు
తన రంగులు విధిల్చివెళ్ళింది...
అందరూ
వింతలు విడ్డూరాలు అంటున్నారు
ఏమొయ్...నిజం చెప్పు
నీవు వచ్చి వెళ్లావు కదూ..
కొన్ని ఆనవాళ్లు దాచి వెళ్ళింది ఇక్కడే కదూ...