ఈరోజు సమావేశం కొనసాగుతుంది
ఒక సలహా నా ముందుకు వచ్చి నిలిచింది
అది ఒకరికి అందించనా వద్ద సంశయంతో
చేతిలో అలానే ఒదిగిపోయింది
ఏదైతేనేం రెక్కలు విప్పుకొని అతని వైపు సాగింది
నీ అనుభవం కలిపి చెప్పిన సలహాకు
మార్కులు ఎన్ని మది నిలదీసింది...
నిజాయితీగా లెక్కలు వేయడం మొదలుపెట్టాను
60 దాటి మించనేలేదు...
ఇంకా నిక్కచ్చిగా వేస్తే 40 మార్కులేనేమో
అయితేనే అవి ఉత్తీర్ణతకు సూచికే కదా..
కాల గమనంలో
ఏమో అది 90 కావచ్చు
కానీ 40 నుంచి దిగదు కదా....
అందుకే నా సలహా నిజాయితీగా
నిక్కంగా ఉత్తీర్ణత సాధిస్తిందని...
రంగుల రెక్కలు తొడిగి వదిలాను...
సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉంది
నేను నిశ్శబ్దంగా లేచి వెనుతిరిగాను...