అప్పుడప్పుడు - అలా -2

పదేపదే ఎవరు నువ్వు
అనే ప్రశ్నతో మొదలు పెడతా

చివరాఖరుకి నీలో కొంత
నా దగ్గరే ఉండిపోయింది
అంటూ ముగిస్తా....

***

నీ అడుగుల సవ్వడి కోసం
పరుగులు తీస్తున్నానంటాను

నా అడుగుల కింద నలిగే
చేతుల సంగతి మరిచాను

****

ఊసులు చెప్పలేదని
అల్లాడిపోతాను

ఊహల నిండుగా నీవెట్లా
వచ్చావో మర్చిపోతాను

*****

కలలతో సావాసం చేస్తూ
నా కనులు నిదురతో యుద్ధం చేస్తున్నాయి....

ఆకతాయి మనసు నీ చెంత చేరి
తమాషా చూస్తుంది..

చెపితే వింటేగా
అచ్చంగా నీలా..

****"

అక్షరం నీ చెలి కాబోలు
అందుకే నీపై మక్కువ ఎక్కువ

నా చెంత చేరి
మోహపు రాగాలు పలుకుతుంది
నీకోసం......

******

ఎన్నో ఏళ్లుగా కనబడని
తపస్సు చేస్తున్నానేమో

వరమై నువ్వు వచ్చావు
నా ... నువ్వుగా


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!