సముద్రపు ఉప్పెనలా

నేను నదినై నిశ్శబ్దంగా ఉన్నప్పుడు
సముద్రపు ఉప్పెనలా నను చేరుతాడు

నేను వాననై కురిసినప్పుడు
ధరణిలా ఒడిసిపడతాడు

విరాగినై ఓ బాట పడితే
వటవృక్షమై కదలివస్తాడు

తప్పు పట్టడు ...తప్పుకు పోడు
తలవంచనీయుడు ..తనను దాటిపోనీడు

అందుకే
ఆకాశపు హద్దుచెరుపుతూ
ఎంతైనా ప్రేమించొచ్చు


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!