మా ఇంటి పెరడు నిండుగా
రంగురంగుల సీతాకోకచిలుకలు
అందులో కొన్ని వలస వచ్చినవి కొన్ని
దారి తప్పి వచ్చినవి మరికొన్ని
అందంగా ఉన్నాయని అట్టి పెట్టుకోలేక
తిరిగి ఇద్దామని వెళితే
మరెన్నో సీతాకోకచిలుకలు
రంగులద్దుకొని ఎదురుపడ్డాయి
ఒకప్పటి అంతర్వాహిని సెలయేరు అయినట్టు
అచ్చంగా నీ అనురాగంలా...
అవును
అవన్నీ నాలోని నీ జ్ఞాపకపు
రంగుల సీతాకోకచిలుకలే కదా