అసంపూర్ణ వాక్యాలే....

నీవేమో నా మాటలన్నీ కవితల్లా ఉంటాయంటావు....
ఇందులో నా ప్రమేయం అణువంత కూడా లేదు...

అక్షరాలకు నీ మీద కాస్త మక్కువ ఎక్కువ...
నిను చేరి నీ మదిన చిక్కుకొని పోవాలని ఆశ ఎక్కువ కాబోలు...

ఎన్ని మాటలు చెప్తే ఏమీ కానీ... ఒక పథేర్ పాంచాలికి....
ఓ కాశ్మీరులోయకి నేను బానిసలు అయినట్టు... ఇప్పుడు ఇలా ..నీకు కూడా ....

******
అప్పుడప్పుడు నా మనసు చెప్తుంది
మదిలోని భావాలు ఆకాశంలోకి విసిరెయ్య మని
ఎదురుగా కనిపించే మనిషిని విసిగించవద్దని...

అయినా ఏం చేయను
అక్షర జ్ఞానం లేని ఆశ
నీకోసమే రాస్తానంటుంది

*****
నీవో అనంతమైన సంగీతమే..

అందులో
నేను ఒడిసిపెట్టుకున్న రాగాలెన్నో ..వదులుకున్నవెన్నో
అయినా నా దోసిట ఒదిగిన మోహపు గీతాలు అద్భుతమే

నాలో నిన్ను దాస్తుంది మరి

*****
అన్ని అసంపూర్ణ వాక్యాలు అంటాను నేను..
నువ్వు నేను ఉన్నాక.... అన్ని సంపూర్ణ వాక్యాలే
అంటూ చిరునవ్వుతో తేల్చేసావు మరి....


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!