అతనో మురిపపు పాటకు
చెదరని నవ్వుని జత చేర్చి
మా ఇంటిముందు జారవిడిచాడేమో
అదేమిటో
నా గాలివాటపు మాటలు
మధురిమలు అద్దుకొని
అతనివైపు అడుగులు వేసి
మోహపు రాగాలు పలుకుతున్నాయి
అయినా
అతను నా మనసంతా
అల్లుకున్న సముద్రమే కదా..
నా కన్నులు మురిపెంగా చూసే
వర్షపు చినుకులే కదా...
ఏనాడో నేను దాచుకున్న
తాటాకుబొమ్మే నేమో....
అయినా .....అతని పాటకు
మా ఇంటి ఆనవాళ్లు ఎరికే కదా
నా మాటలు ఆ పాటకు జతకత్తే కదా
బహుశా ......
ఇద్దరూ తోడు దొంగలేనేమో కదా...