నీకై అన్వేషించినపుడు
సముద్రపు లోలోతుల్లో నుండి
ఓ పాట నా వైపు పయనిస్తుంది
నీవు నా ఎదురుగా ఉన్నావని
నా మనసు నిండుగా నీవేనని
నా ప్రతి మాట నీ కోసమని
పదేపదే అనుకుంటా....
అయినా ఎందుకో
నీవు తెలుసన్న ప్రతిసారి...
తెలియని ఆశ్చర్యం
అనుకోని గుబులు
అలవి కాని దుఃఖం..
నా చుట్టూ ఓ గోడ కడుతుంది..
అయినా
నాలో అణువణువుగా నీవైతివి
నీవు తెలియదు అని అనేది ఎలా
నీ నుంచి తప్పుకు పోయేది ఎలా..
ఏదిఏమైనా
అప్పుడు.. ఇప్పుడు
నువ్వు మాత్రం.....
మోహపు సముద్రం
ఆలపించే వేణుగానమే ...