ఓ ఫిల్టర్ కాఫీ కథ

బహు చక్కని కాఫీ షాప్
చక్కటి కాఫీ రుచి
మాటలకు అందలేదు

చకచకా వేళ్ళు కదిలాయి
సందేశం వెళ్ళింది..
కాఫీకి రాగలరా అంటూ ..

నేనా ఇప్పుడా???
పరిచయం లేదేమో....
why choose me????
తిరుగుటపాలో జవాబు అందింది

ఆలోచనలో పడింది
మీకు కాఫీ ఇష్టం కదా
గంట తర్వాత మరోసారి
కాఫీ రుచి చూద్దామని
coffee choose you
వివరణా సందేశం వెళ్ళింది...

ఇప్పుడు ఇద్దరూ...
కాఫీని ఆస్వాదిస్తూ

ఆమెకు తెలుసు
ఇలానే మరోసారి
సందేశం పంపబడుతుందని

రెండో కాఫీతో అతను
ఎదురుగా పరిచయం లేని
మరొకరుతో ..

ఇది ఓ ఫిల్టర్ కాఫీ కథ
కొనసాగుతూనే ఉంటుంది...
 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!