రాలిపడిన జ్ఞాపకాలు..

పాతబడిన జ్ఞాపకాన్ని
విసిరేద్దామని వెళితే ..
పారవేసే చోటు దొరక్క
పాత పుస్తకంలో దాచా..

పాత పుస్తకాలతో
అర నిండిపోయిందని
అమ్మబోతే........
జ్ఞాపకాలు విదిలించి
పుస్తకాలు కొనుక్కెళ్ళాడు..

రాలిపడిన జ్ఞాపకాలు
ఇంటినిండా ........
పడక మీద ఒకటి, పరదాపై ఒకటి
అద్దం మీద ఒకటి, అటకపై ఒకటి
పొయ్యి మీద ఒకటి, పోపుగిన్నేలో ఒకటి
అటునిటు నన్ను కదలనివ్వక..

అదిలించలేక, విదిలించలేక
కాదుపొమ్మని విసిరేయలేక
అప్పటినుండి........
అన్నిటితో స్నేహం చేసి
అపురూపంగా దాచాను
అద్దాల గూటిలో..

ఎపుడో ఒకప్పుడు
మనసుకు నచ్చిన
నా లాంటి....నీకు...
అందిద్దామని.....


Comments

Post New Comment


venkat 09th Oct 2012 03:13:AM

http://www.telugubhakti.com/telugupages/kavita/kadabam/Ammatx.gif


venkat 02nd Oct 2012 22:48:PM

avunu rama devi garu....gyanapakalu epataki gurtuntayi.... very nice