నేను నడిచే ప్రతీ దారిలో
కొంత సమయం దాచిపెట్టబడుతుంది
దాచిన సమయంలో
భద్రంగా రహస్య జ్ఞాపకాలు వేచి ఉంటాయి
నాకు రహస్యమైనది
నీతో పంచుకొని పలచ పరచాలనుకుంటాను
కాని
ఏదీ జరగదు
నీ సమయాలేవీ నా దరిదాపుకు రావు
నాలోని రహస్యాలన్నీ
కొంచెం కొంచెంగా బరువెక్కుతాయి
ఓయ్
ఏది ఏమైనా
నీపై నెపం వేయలేను
నిన్ను వదులుకోవడం నాకు ఇష్టంగా లేదు మరి