ఓరోజు....
నేను ఫోన్ చేశాను... అతను లిఫ్ట్ చేయలేదు.
కాసేపాగి మళ్లీ చేశాను... ఈసారి కూడ పలకలేదు.
మరోసారి చేశాను.. అటు నుంచి జవాబు లేదు
ఫోను వైపు చూసి కూడా తీయలేదనుకున్నాను
ఊరుకోలేక మళ్ళీ చేశాను
హలో అని వినిపించింది ఈసారి
ఒక్కసారిగా గట్టిగా వెక్కివెక్కి ఏడ్చాను..
అతను ఆదుర్ధాగా ఏమైంది అంటూ అడిగాడు.
నువ్వు... నేను
మాట్లాడుకోవట్లేదా తడబడుతూ అడిగాను
ఈసారి అటువైపు నుంచి
చిన్నటి దుఃఖము వెక్కిళ్లు వినిపించాయి..
ఏదో పనిలో ఉండి
అస్పష్టంగా విని వినిపించినట్టుగా అన్నాడు
ఇక మాట్లాడడానికి ఏమీ లేదు
చెప్పని మాటలు చాలా చెప్పాయి.
ఇప్పుడు అంతా సరి చేయబడింది....