నీవంటే ఇష్టం
ఎంతనో చెప్పలేనంత
ఇష్టమని చెబితే
వెనుక వెనక తిరుగుతే
అలుసైపోతాననే
అనుమానమేమి లేదు
అలుసైపోవడానికి
అల్పమై పోవడానికి
అడకత్తెరలో పోకచెక్కనా
అసలు కనిపించని నల్లపూసనా
నీ ఎత్తుకు
సరి తూగుతానుగా
నీ నవ్వుకు
వంత పాడుతాగా
నా అడుగులో అడుగు
వేయమని అడగలేదుగా
నన్ను కాదని తప్పుకుంటే
ఊరకుంటానని కూడా అనలేదుగా
ఆత్మభిమానం అనేదొకటుందట
ఏటిగట్టున పెట్టేసి వచ్చాను ...
నీతో నాకు పంతమేమీ లేదు
తిరకాసు దారులు నా కెరికే
ఓయ్
తకరారు ఆటలు కట్టిపెట్టి
వెనుదిరిగి
నా చేతిని అందుకోకూడదా ...