ఆమె నవ్వింది
అతను వల వల ఏడ్చాడు
ఏమయింది ...
కాస్తంత మార్ధవంగానే అడిగింది
పాతకాలం నాటి ముళ్ళు ఒకటి
మరింత దిగబడింది..
నిశ్శబ్దంగా గొంతులోలోపల
ఓ మాట పలికింది...
ఇంతకూ ...
జరిగిందేమిటో
కొత్త కథ చెప్పబడిందా
చెప్పే తీరు మారిందా
లెక్క తేల్చి చెప్పడానికి... వచ్చేదెవరో!!