'దిమ్మరి' చదువుతున్న అని ఎవరికైనా చెప్తే నా వైపు చిత్రంగా చూస్తారేమో ఎందుకంటే అక్షరాల కంటే దిమ్మరి అనే మనుషులను చూసిన వాళ్లే ఎక్కువ...
ప్రతి మనిషిలో ఒక దిమ్మరి ఉంటాడని జయతిగారు అన్నప్పుడు క్షణమైన ఆలోచించకుండా అవునని అనిపించింది..
దిమ్మరి పుస్తకం ఎందుకు చదవాలి.. చదివాక ఏమవుతుంది.. అందులో ఏముంది ఇవన్నీ చెప్పడానికి అక్షరాలు మాత్రం సరిపోవు ఒక నిశ్శబ్దంలో దాగిన మాటలు వినడం వస్తే మాత్రమే ఈ పుస్తకం అర్థమవుతుంది అనిపించింది.. అలా వినడం వచ్చిన ప్రతి ఒక్కరు దిమ్మరే. ఎందుకంటే మౌనంలో అక్షరాలు అందుకోవడం వాళ్ళకు మాత్రమే వచ్చు,.
దిమ్మరి చదవడం మొదలెట్టాక సమయం ముందుకు వెళ్లడం మానేసి పరుగు పరుగున వెనక్కు వెళ్లడం మొదలైంది.. ఎంత వెనక్కు అంటే నా చూపు అందుకోలేనంత వెనక్కు.. వెనక్కు వెళ్లిన కాలం నుంచి ముందుకు అతి నెమ్మదిగా ఎంత నెమ్మదిగా అంటే యుగాలు పడుతుందేమో అన్నంత నెమ్మదిగా ఎక్కడెక్కడో జారిపోయిన మృదుత్వాన్ని పిడికెడు పిడికెడు అందుకుంటూ మళ్లీ ఇప్పటి కాలానికి చేరడానికి మరి ఎంతకాలం పడుతుందో..
గడిచిపోయిన కాలం .. గడుస్తున్న కాలం ఒక్కసారిగా పక్కపక్కన నడవడం అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. తప్పిపోయిన బుజ్జి పిట్ట ...ఆనవాళ్లు చెరిగిన రహదారి.. హఠాత్తుగా కొన్ని పేర్లు జ్ఞాపకమై వచ్చి మనిషి రూపానికి రంగు వేయడం.. అసాధ్యమైన కల ఒకటి రెక్కలు విప్పుకొని ముందర నిల్చోవడం.. ఎన్ని అపురూపాలో .. తప్పిపోయిన దిమ్మరితనం కాసింత పిడికిట్లో దాచుకోవడం..ఓహ్ ఇది చాలదా ఈ జీవితానికి..
Thank you❤️❤️ Jayati Lohithakshan
Lohi Choichi Koran