కవిత్వ నవీకరణలో కొత్త తరం కవులు..‌!!

ప్రేమ ఇది ఎప్పుడూ కొత్త కథనే ...తెలిసిన కథలో కొత్త మలుపు... ఎప్పుడు అద్భుతమైన అపురూపాలు అందిస్తూనే ఉంటుంది అలసిపోకుండా...  అందుకునే హృదయాలకు.
ఇంతటి గొప్ప కానుక అందుకోవడం... ఇక్కడ ఇలా ఎంత బాగుందో... Thank you .. Abdul Rajahussain   gaaru

*ముద్ర 1.

*కవిత్వ నవీకరణలో కొత్త తరం కవులు..‌!!
*కవిత్వం అంటే  ఏమిటి? అదేమైనా బ్రహ్మ
పదార్థమా? కవిత్వం ఎక్కడినుంచి వస్తుంది.!
కవిత్వంలో పదాల్ని పేర్చకూడదు..అలా చేస్తే
చేయితాకిడికే పేక‌మేడలాకూలి పోతుంది…!
కవిత్వంలో పదాలు నాగార్జున సిమెంట్ తో
‌గోడకట్టినట్లుండాలి..చివరకు గడ్డపలుగైనా 
భయపడేలా వుండాలి.కవిత్వంలో  వస్తువు,
భావం ‌ఆకాశాన్ని తాక కూడదు అది నేల
మీదే వుండాలి.  ‌

మనుషులకు  దగ్గరగా, హృదయాల
కు మరీ దగ్గరగా కవిత్వం లో పొట్టీ,పొడుగూ 
లేదు..చిట్టీ,పొట్టికవితైనా,..అది అద్భుతం కావా
లి.మనుషుల్ని,మనసుల్ని దగ్గరచేయాలి .కవి
త్వం మనిషి శ్వాస కావాలి. కవిత్వం.మనిషి
తనం పెంచాలి.కవిత్వం మను షుల్ని కనాలి.
ఏతావాతా చెప్పొచ్చేదేమంటే‌‌ ప్రజల దగ్గరకు 
వెళ్ళేది ప్రజలతో మమేక మయ్యేది కవిత్వం .
నన్నయ్య నుంచి నాదాకా కవిత్వం ఎన్నో కొత్త
పోకడలు పోయింది.ఎన్నో కొత్త వాదాలొచ్చా
యి.ఇందులో అస్తిత్వ వాదాలు ఇప్పుడు తెలు
గు సాహిత్యాన్ని బాగా ప్రభావితం చేస్తున్నాయి…
అలాగే లఘురూప కవితా ప్రక్రియలు  నానీలు,
రెక్కలు,హైకూలు,తదితర రూపాల్లో  కవిత్వాన్ని 
సుసంపన్నం చేస్తున్నాయి.లఘురూప కవిత 
మినీకవిత దగ్గరే ఆగ కుండా రెక్కలు విచ్చుకొని 
తెలుగుసాహితీ లోకంలో  స్వేఛ్ఛగా పురి విప్పు
కుంటోంది..

కవిత్వంలో నవీకరణ ఈనాటిదికాదు..సాహిత్యం
పరిణామ శీలి.మార్పు దానికి మారుపేరు‌..సామా
జిక,కాలమాన పరిస్థితులప్రకారం కవిత్వం తన 
భాషను,వ్యక్తీ కరణను,రూపాన్ని మార్చుకుంటూ
వుంటుంది..

ఫేస్బుక్ మాధ్యమం వచ్చాక కవిత్వం నిత్యావసర
సరుకైంది..కవిత్వం రాసేవాళ్ళు ఎక్కువయ్యారు..
కవితా సంగమం లాంటి ఫేస్బుక్ గ్రూపులెక్కువ
య్యాయి..వర్ధమాన కవులు/ కవయిత్రుల సంఖ్య
పెరిగింది.టన్నుల కొద్దీ కవిత్వం వస్తోంది.అయితే‌
వచ్చేదంతా మంచి కవిత్వమేనా? అంటే ఖచ్చితం
గా కాదనే సమాధానం వస్తుంది.అయితే నాణ్య
మైన కవిత్వమూ లేకపోలేదు.‌ఫేస్బుక్ కవులకు
ఓ పాఠశాలగా మారింది..ఫేస్బుక్ లో పరిణితి… 
పొందినకవులు కొత్త సంకలనాలతో పాఠకుల‌….
ముందుకొస్తున్నారు.ఒకరా! ఇద్దరా!  ఎందరో
యువ కవులు /కవయిత్రులు సాహిత్యాన్ని
సుసంపన్నం చేస్తున్నారు..ఎందరు కవులున్నా
ఎవరి పంథా వారిదే..ఎవరి శైలీ వారిదే..కొందరు
ప్రేమ కవిత్వం రాస్తే..ఇంకొందరు విప్లవ కవిత్వం
రాస్తున్నారు.ఇంకొందరు అస్తిత్వ కవిత్వాల వైపు
మొగ్గు చూపితే..మరికొందరు తాత్విక/ భక్తి కవి
త్వాన్ని ఆశ్రయిస్తున్నారు.‌అలాగే వచన కవిత్వం,
లఘు రూపకవిత్వం ఇప్పుడు తెలుగుసాహిత్యం
లో  రాజ్య మేలుతున్నాయి.‌తమ ఉనికిని చాటు
కుంటు న్నాయి..ఈ వ్యాసంలో కొందరు యువ 
కవుల/  కవయిత్రుల కవిత్వ ధోరణులన్ని చూద్దాం.

*ప్రేమ కవిత్వం…
ఇటీవలి కాలంలో ప్రేమ కవిత్వం రాస్తున్న కవులు/
కవయిత్రుల్లో గీతా వెల్లంకి,నిర్మలా రాణి,రమాదేవి,
మాడిసెట్టి శ్రీనివాస్,ఆనంది కె.. మూర్తి,‌  ప్రభృతు
లున్నారు.

*రేయంతా నిరీక్షణలో దగ్ధమైన
నాలోంచి
మిణుగురుల్లాగా వెలుగుతూ
ఎగసే జ్ఞాపకాలు
నీవే కదా!
ఈఉదయపు తెలిమంచు
తునకల తాకిడికి
గడ్డకట్టిన
హృదయానికేమెరుక?
ద్రవించినా
ఘనించినా నీకోసమే మరి!
కనురెప్పలలో దాచిపెట్టిన
కాలం చెర విడిపించుకుని విరగబడి పరుగెడుతోంది!
నేనో చల్లారిన అగ్నిపర్వతమై
ఇంకా వేచి ఉన్నాను
ఎప్పటికైనా సరే
నీవొచ్చినపుడు …
రవంతైనా రగలనూ?
గీతా వెల్లంకి అనగానే .. ఫేస్బుక్ పాఠకులకు
చప్పున గుర్తొచ్చేది “ప్రేమ కవితలు "ఓ ప్రత్యేక డిక్షన్ లో రాసే ఆమె కవితలు'అంటు మామిడి' లాంటివి. మాలిన్యం అంటని రెండు మనసుల పవిత్ర  ప్రేమ కవిత్వం అది.ఆమె "డార్క్ ఫాంటసీ"
ప్రేమకవిత్వానికి చూపుడు వేలలాంటిది.
గీత క‌విత‌లలో ప్రేమ ఉంటుందిఒక అలౌకిక హృద‌యావేద‌న ఉంటుంది!  జ్ఞాప‌కాలూ…
స్మృతులూ,ఆకాశాలూ,స‌ముద్రాలూ,న‌క్ష్ర‌త్రాలూ
ఎడారులూ,పిట్ట‌లూ,చేప‌లూఇసుక‌రేణువులూ
కెర‌టాలూ" ఇంకా ఎన్నో ఉంటాయి..అవ‌న్నీ ఆమె
డార్క్ ఫాంట‌సీలే..ప్రేమ మయాలే..!

*రమాదేవి…!!

"నీ ఆనవాళ్లు ఒడిసి పట్టిన ప్రతిచోట
నా హృదయం కొంచెం కొంచెంగా కడిగి నీరైపోయింది....

ఎన్ని చోట్ల ఎన్ని ఆనవాళ్ళు
వడిసిపట్టానో..
లెక్కా పత్రం రాయనే లేదు...
మరి ఇంకా హృదయం ముక్క \
ఏదైనా మిగిలిఉంటుందా....

నీవొక  గొప్ప జాలరివి ఓయ్...
సముద్రపు అలలపై తెలియాడే
వేల పడవల్లో
నా అనవాలు ఒడిసిపడతావు....

సముద్రపు లోతుల్లో ..
నీ చెంతచేరే వలలోని
చేపపిల్ల నేనే కదా..

అయినా ఎందుకో..
సముద్రపు అలల నురుగలా
నీ ఒడిలో ఉన్నానని..
నాకు నేను అర్థం కాని ఓ సగానికి
అర్థం నువ్వేనని "

ప్రేమ కవిత్వంలో కొత్త తరంగం రమాదేవి..
రమాదేవి  ప్రేమకవిత్వం బాగా రాస్తారు.
రమాదేవి కవిత్వంలో ఓ ఫీల్ వుంటుంది..
అది❤️ గుండెను తడుతుంది.తడి చేస్తుంది.
మనసు పారవశ్యంలోమునిగితేలుతుంది.!

*మాడిసెట్టి శ్రీనివాస్…!
"ఓయ్...
గుర్తుకొస్తున్నావు మరీ మరీ...
ఓ కాఫీతో నువ్వూ నేనూ...
మనతో మనం కబుర్లు
మనలో మనం మమేకమై
మైకమై...
మరో లోకమై...
నీ నుండి ఓ నవ్వు రాలి నా కంట్లో పడ్డప్పుడల్లా
గుండె గతి తప్పేది...
నీ పెదాల్లోంచి జారిన పదాల సరిగమ
చెవుల్లో తేనియను నింపేసేది...
జాబిల్లి వెన్నెల్ని రాల్చినపుడల్లా...
శీతల పవనం పూలను కౌగిలించుకున్నపుడల్లా...
ఝల్లుమనే మనసుని నీ జ్ఞాపకాలు ఢీకొన్నపుడల్లా...
గుర్తుకొస్తున్నావు మరీ మరీ…"
మాడిసెట్టి శ్రీనివాస్ ది 'గోదారంత ' ప్రేమ..
అటు నువ్వు...నాలో గుండెవై,నాగుండెల్లో
గోదారివై...ఇటు నేను..నీ గోదారి జీవితంలో
గుండెనై...కలవని దిక్కుల్లా,చెదిరిన మేఘాల్లా...
గుండెలో గోదారినికళ్లలో నింపేస్తూ...గోదారిలా
శబ్దించే గుండెనుగోదారిలో కలిపేస్తూ,నా గుండె
ల్లో గోదారివై..నువ్వు...గుండె గోదారై రోదిస్తూ
నేను..అప్పటికీ..ఇప్పటికీ.ఎప్పటికీ..నీ వాడినే"
అంటాడు శ్రీనివాస్.తనకెంతో ఇష్టమైన ప్రియు
రాలైనా,గోదారమ్మ లోగిలిలో మునకలేయందే
'శ్రీనివాస్ '  కలం ముందుకు కదలదు..!!

*మూర్తి కందేపి…!!
ప్రేమ కవిత్వాన్ని మనసుపెట్టి రాసే కవుల్లో
మూర్తి ఒకరు..
*రాత్రి ఆమె…
ఓ నవ్వు నవ్వింది,
ఆకాశమంతా
నక్షత్రాలు మెరిశాయి.
ప్రొద్దుటే ఆమె
మూతి ముడిచింది,
నక్షత్రాలు తోకముడిచాయి."!!
*దారి పొడవునా
గంధపు వాసన,
ఆమె …
ఆ దారిన వెళ్ళిన
ఆనవాలుగా.
తను గాలికి
గంధం పూసింది."!
ప్రేమ ముదిరితే ఆరాధనవుతుంది.ప్రస్తుతం మూర్తి
కూడా శ్రీమతి ఆరాధనలో వున్నాడు..ఆమె ప్రతీ
కదలిక తనుకు స్పెషలే..ఆమె నడిచిన దారివెంట
గంధపు వాసనే.ఆమె నడిచి వెళ్ళిన దారి ఆనవా
లు  ఆ గంధపు పరిమళమే..అంటున్నాడు మూర్తి.

2 భక్తి కవిత్వం…!!
*ఆనంది….సర్వం ప్రేమ/ భక్తి మయం.
భావకవిత్వం మనకు తెలుసు,భక్తి కవిత్వమూ మనకు తెలుసు..అటు భావకవిత్వాన్ని, ఇటు
భక్తి కవిత్వాన్నికలగలిపి కాకటైల్ గా వడ్డిస్తోంది ఆనంది.

*"నీ చిరునామా అడిగావు కదా !
ఇదిగో నాచిరునవ్వే...
నీ చీకటికి వెన్నెల కోరావు కదా !
ఇదిగో నా కనుల పలకరింతలే....
నీ ప్రేమ  సంతకం చేస్తా అన్నావు కదా!
ఇదిగో అరుణవర్ణం అద్దుకున్న నా నుదురే...
రేయికి దీపం...
పోగటికి వెన్నెల ఉండవు అన్నావు కదా...
రేయి దీపం నా పాపిట సింధూరమోయి…
పగటికి వెన్నెల నా కంటి కాటుక
కనుబొమ్మలే లెవోయి.. మొద్దుఅబ్బాయి"!!.
కృష్ణతత్వాన్ని అక్షరానికద్దుకున్న కవయిత్రి ఈమె..

*శిరీషా."….అభినవ రాధిక..!!
"నీలాల నింగి నీ రూపమై పరుచుకున్నప్పుడు
నేను గాలి తెమ్మెర పై నీ వేణువు లో చేరి
అనురాగం రాగమునై సరాగాలు మాలికనై
మెల్లగా శూన్రమంతా పరుచుకుంటాను..
కృష్ణా! నీ వేణువు నా ఊపిరి "..
అంటోంది ఈ అభినవ రాధిక..ఈమె కృష్షభక్తు
రాలు.ఈమె కవిత్వమంతా  ప్రేమతత్వమే..
అలాగే...ఆరాధనా భావం.ప్రతీ అక్షరంలో చిప్పిల్లు
తోంది.శిరీష

భావనాగరిమ గురించి ఎంత చెప్పినా తక్కువే !!
"ప్రతీ పాదంలో నువ్వున్నావు.
ప్రతీ పాటలో నువ్వున్నావు
ప్రతీ భావం వెనుక నువ్వున్నావు
నీవు లేని చోట మాకు స్థానమే లేదు"
కృష్ణ తత్వం..తన్మయత్వం.ఆరాధన,అంకిత
భావంశిరీష కవిత్వానికి నాలుగు స్తంభాలు..
ఈ ' నిశ్శబ్దలయల్ని' వినాలంటే పాఠకులకు హృదయముండాలి.దానికి స్పందన వుండాలి.!!
ఆమె జీవనమే..సంగీతం..కృష్ణ తత్వం..!!


3.అస్తిత్వ కవిత్వం..!!

*తగుళ్ళ గోపాల్…
అస్తిత్వ కవిత్వానికి కేరాఫ్ గోపాల్..ఈయన
తొలి కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడెమీ
యువ పురస్కారం లభించింది.‌
"పొద్దూకే జాములో
గొర్రెపిల్లను భుజాన వేసుకొని నడుస్తుంటే
నన్ను గూడ ఎత్తుకోమని
సూరీడు చేతులు చాచి ఎంటవడేటోడంట
తోడేండ్ల నుండి
మందను కాపాడేటందుకు
నీ కంటిదీపాలతో పాటు
మూడో కన్నుగా ఉన్న కుక్క
మాటిమాటికి నీతోపాటు నిద్రలేచేదంట
..
పదిమందిల తిరిగినప్పుడు
గొల్లపెద్దయ్య మనువడిని అని చెప్పుకోవడమంటే
నీ ముంజేతిని ముద్దాడిన దండకడియాన్ని
ముద్దుపెట్టుకున్నట్టే ఉంటది.!!
గోపాల్ కవితలోని సొగసంతా “తాత దండకడి
యం “లోనే వుంది.తన తాతనుకవిత్వీకరించి
పాఠకులకు పరిచయం చేసిన తీరు గొప్పగా వుంది.ఇందులో వాడిన కొన్ని కవిసమయాలు గోపాల్ లోని ప్రతిభకు గీటురాళ్ళు.!!

*రమేష్ నాయక్…
రమేష్ నాయక్ బల్దేర్ బండి…బంజారాల
అస్తిత్వానికి అద్దంపడుతుంది..
"కొమ్ముదీపశిల “ లో తాత గురించి రాసిన కవిత నాయక్ ప్రతిభకు నిలువెత్తు అద్దం పడుతుంది.
*ఇంట్లో గిన్నెలు ఆకలిని కప్పడానికి
  బోర్లబొక్కల పడగానే
  నానమ్మ లాంతరు కన్నుని నిద్రపుచ్చడానికి
  దాని గొంతుని నులిమేస్తుంది….
  …………………………………….
  కొమ్ము ఒడిలో దీపశిల మా తాత
  చెట్టు దిగి లాంతర్ని ఆ చెట్టు కొమ్మకే
  వేలాడదీసి ఓ పందిని భుజానేసుకొని
  సంతలో అమ్మి సంత్ర గోళీలు,చెప్పులు
  ఓ అంగీ లాగు నానమ్మకు
  ఓ జాకిట్ పేల్క బొట్టు బిల్లల డబ్బా తెస్తాడు.
  పచ్చదనము ఎండి బంగారు
  వర్ణమయ్యే వరకు
  రోజూ మా తాలు నాయినలు
  కొమ్ము ఒడిలో దీపశిలలే..!!”
మంచి కవిత్వమెపుడూ మనింటినుండే వస్తుంది.
మన చుట్టూ వున్న మనుషులు.పరిసరాలు,ప్రకృ
తి నుండి పిండుకున్న కవిత్వం పరిమళమే ఈ’ బల్దేర్ బండి.’!!
*ఇబ్రహీం నిర్గున్ వెచ్చటి  నెత్తుటికథ…!!
*“గుంపు తురాయి వంపులోంచి రేలపాట పాడుకోదు
తుడుమాట బొడ్రాయి మలుపు మీద కలిసి ఆడుకోదు
జట్లు జట్లుగా కలిసి అలల హోరులా ఎగిసి పడదు
గుడిసెల మీద నల్లమబ్బుల తెరలు దించుకున్న గూడెం
పెను చీకట్లలోంచి బయటకు రాదు
తన వాళ్ల  నెత్తుటి వాసనను పీలుస్తూ
పసిగుడ్డులా గుక్క పట్టి ఏడుస్తూ  ఉయ్యాల్లోంచి
దిగిరానప్పుడు
అరణ్యం... తడి గాయన్ని తనను తనే
తడుముకుంటున్నప్పుడు
ఎవరి ఓదార్పుకు నోచుకోదు"
అడవిలో అన్నల ఎన్ కౌంటర్ పై నిర్గున్ రాసిన
కవిత ఇది..ఇదే కాదు..కూలితల్లుల పై నిర్గున్
రాసిన కవీత కూడా అస్తిత్వ మూలాలున్నదే..!!

4*విప్లవం/ తిరుగుబాటు స్వరం…!!

*సుభాషిణి తోట…ధిక్కార స్వరం.‌
"గాయాన్ని చేసి
హేయంగా మాటలతో కోస్తున్నప్పుడు
తట్టుకోలేని సంఘర్షణ మౌనాన్ని చేరుకోగానే
విప్పిచెప్పలేక నేను అడవిలో మానైపోతున్నా
చీకటి నిట్టూర్పుల్లో
కాగడా కోసం వెతుకుతున్నప్పుడల్లా
వాడు గాలై నన్ను బంధిస్తున్నాడు
మంటై నేను చెలరేగేందుకు
నాకు కొన్ని మగపదాలు కావాలి
ఖచ్చితంగా నాకు కొన్ని మగపదాలు కావాలి
మానని పుండుని చేసి
మానాన్ని అభిమానాన్ని నిలువెత్తునా చీల్చి
స్త్రీత్వాన్ని  వీధుల్లో అమ్మేందుకు ప్రయత్నిస్తున్న వాడి చేష్టలను నిరోధించడానికి
నాకు కొన్ని మగపదాలు కావాలి…
                  *మగపదాలు కావాలి..!!
ఇప్పుడు సుభాషిణి తన కొత్త డిక్షన్ కు కొత్తపదాల వేటలో పడ్డారు.తన వ్యక్తీకరణకుకొన్ని“మగపదాల”
అవసరం వుందంటున్నారు.’యద్భావం తద్భవతి ‘ భావాన్ని బట్టి వ్యక్తీకరణవుండాలి.అందుకు సరైన పదాలు కావాలి.అవి కూడామగపదాలైవుండాలట
స్త్రీలపై అత్యావీధుల్లో అమ్మే దుర్మార్గులపై దండెత్త
డానికి ,దాడిచేయడానికి తగ్గ శక్తివంతమైన పదాల
కోసంఆమె అన్వేషిస్తున్నారు.మగాడి దుర్మార్గాన్ని ,
దౌష్ట్యాన్ని ,ఆధిపత్యాన్ని ఎదిరించడానికి ఖచ్చితం
గా కొన్ని మగపదాలే కావాలట.వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి.కత్తిని కత్తితోనే ఎదుర్కోవాలి,‌అన్నట్లు మగవాడిని ఎదుర్కోవాలంటే మగపదాలే…
కావాలట.

*మెరాజ్ ఫాతిమా…
ఆడాళ్లకు మగాళ్లు మాత్రమే శత్రువులనుకునే పురుషద్వేషుల ఇజం నిజం కాదన్నదిమెరాజ్ అభిప్రాయం.ఆడాళ్లకు ఆడాళ్లు కూడా శత్రువులే. 'అమ్మ’ స్థానంలోవున్న ఆమె‘అత్త’ స్థానానికి వచ్చేసరికి స్వభావం మారుతుంది.’అమ్మ '
కాస్త “అపరకాళిగ "మారుతుంది. ఇక ఆడపడు
చుల ఆరళ్లు,అమ్మలక్కల చాడీలు, చెవికొరక
టాలు సరేసరి.నాలుగు కొప్పులు ఒక చోట
చేరితే ఏ మహాతల్లికో మూడిందన్న మాటే!

వీళ్లు కీచకులకంటేతక్కువేం కాదు.
“ఆడ పిల్లలపై గొంగళి దుప్పటి కప్పితే
దురద సహజమేనని పలికేది ఆడ కీచకులే
తీరికగా వేటాడే తిమింగిలాల తిరణాలలో
ఆడ మాంసాన్ని ఎరగా వేసే మంత్ర గత్తెల 
మాయలివె”
గొంగళి దుప్పటి కప్పి దురద సహజమనడం,
తిమింగిలాలకు ఆడ మాంసాన్ని ఎరగా వేయడం
ఆడకీచకులు చేసే పని.మనకు ద్రౌపదిని బలాత్క
రించబోయిన కీచకుడు తెలుసు. కీచకుల్లోఆడ
కీచకులు కూడా వుంటారన్న సత్యాన్ని మెరాజ్ ఆవిష్కరించిన తీరు ఎంతో సహజంగావుంది.!!


*షేక్ పీర్ల మహమూద్…!!
పరిమాణాన్నీ ఆకారాన్నీ ఏ భాష్యంతో
తూస్తావు
శాబ్దిక ప్రకంపనలను బట్టి
కోప క్రోధ ప్రమోదాలను గుర్తిస్తావు
ఎవరినీ ఎవరు నువ్వని అడగకు పలకరిస్తూ పో
పలవరిస్తూ పో
పలవరింత కెరటమై అందరినీ చుట్టుముట్టేయాలి
నీ గొంతు వారి గొంతుని కౌగిలించుకోవాలి
నీ కంఠధ్వని తరంగాలు తగిలి నిన్ను నువ్వనే వారు చెప్పగలగాలి
గుర్తుపెట్టుకో పేరు ముఖ్యంకాదు
దేహం అస్తిత్వం కాదు
నీలోంచి మాటల ఊట ఊరడం ముఖ్యం
అన్నింటికీ మించి
నీకు కంఠం ఉండడం ముఖ్యం
కంఠం నీ వ్యక్తిత్వం కావడం ముఖ్యం…!!
మహమూద్ వామపక్ష భావాలు గల కవి.ప్రశ్నిం
చడాన్ని ప్రేమిస్తాడు.సొంత వ్యక్తిత్వం లేనివాడు
మనిషే కాంటాడు..ప్రశ్నించలేనపుడు పుట్టి
కూడా వ్యర్ధ మంటాడు..‌
ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది కవులు
మనకు తారసపడతారు.వాదమేదైనా..వాదనే
మైనా నవకవుల అక్షరాల్లో కవిత్వం మొగ్గ
తొడుగుతోంది..!!

..
*ఎ.రజాహుస్సేన్..!!


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!