*కాఫీ విత్…ఆర్.రమాదేవి…411

*కాఫీ విత్…ఆర్.రమాదేవి…411.
 
*ఆక్షేపించను లేను... క్షమించను లేను..!!
*ఎర్రబడిన కన్నులతో యుద్ధం చేయాలనిపిస్తుంది..!!
*కదలని కాలంలా ఎదుట నిలవాలని ఉంది.!!
 
ఇది పక్కా 'రమాదేవి' మార్క్ కవిత ఇది...!
తన జానర్ లోనే  రాసుకున్న ప్రేమ  కవిత..!
 
"అతను మర్చిపోయాడు
ఎన్నోసార్లు మరిచిపోతూనే ఉంటాడు
అయినా ….
ఉగ్గ పట్టుకొని ఎదురు చూస్తూ ఉంటాను
నేను గుర్తుకొచ్చి పలకరించే క్షణం కోసం...
గుర్తుకొచ్చిన క్షణం అంతా నేనేనంటాడు
క్షణం గడిచాక అందరూ నా వాళ్లేనంటాడు
ఆక్షేపించను లేను... క్షమించను లేను
ఎర్రబడిన కన్నులతో యుద్ధం చేయాలనిపిస్తుంది
హింసించి వేధించి గాయపరిచి ఏదేమైనా
కదలని కాలంలా ఎదుట నిలవాలని ఉంది...
తప్పు తప్పంటూ మతి వారిస్తుంది
తప్పుకోలేనని మది ఏడుస్తుంది..
వెలుగు రేఖలు విసిరేసి వచ్చాను
చీకటి తావులు వదిలేసి వచ్చాను
ఓయ్...ఇప్పుడు
నిన్ను వదిలి వెళ్ళినా...
నేను దాక్కునే చోటు ఏది"!!
 
             *రమాదేవి.!!
   
అతడొస్తాడన్నాడు..కానీ మరిచిపోయాడు.
ఇదేం తొలిసారి కాదు..అతడు ఎప్పుడూ..
ఇంతే..వస్తానంటాడు.కానీ,ఎంతకూ రాడు..!
అయినా,తను మాత్రం అలా ఎదురు చూస్తూ
నే వుంటుంది.ఎప్పుడైనా తనుగుర్తొచ్చి,పలక
రిస్తాడేమో? ఏమో? ఆక్షణం వస్తుందేమోనని
ఆమె అలా..ఎదురుచూస్తూవుంది..!!
 
అతడు చాలా చిత్రమైనవాడు‌.ఆమె గుర్తు
కొచ్చిన క్షణం అంతా తానేనంటాడు..క్షణం
గడిచాక అందరూ తనవాళ్లేనంటాడు….
మంచిదే కదా.! ఇందులో ఆమె ఆక్షేపించా
ల్సిందేం లేదు కానీ,అలాగని అతడ్ని క్షమించలేనంటోంది.‌
అతడితో ఎర్రబడిన కన్నులతో యుద్ధం చేయాలనిపిస్తోందట.హింసించి,..
వేధించి'  గాయపరిచి ఏదేమైనా,కదలని …
కాలంలా ఎదుట నిలవాలని ఉందంటోంది..
 
నిజానికి తన నిర్ణయం సరైనదేనా?
ఎందుకోఆమె మతి తప్పు.. తప్పంటూ..
వారిస్తుంటే, తప్పుకోలేనని మది ఏడు..
స్తోందట..!
మనసు గట్టిగా చిక్కబట్టుకొని…
ఆమె…
వెలుగు రేఖలను  విసిరేసి వచ్చింది..
చీకటి తావుల్ని  వదిలేసి వచ్చింది..!
అలా వదిలేసి వచ్చింది కానీ…
మళ్ళీ సంశయం ..పీకులాట.?
ఇప్పుడు…
అతడ్ని వదిలి వెళ్ళినా…
తాను దాక్కునే చోటు ఏది"!!
పిచ్చికాకపోతే…
అసలు అతడు లేని చోటంటూ
ఏముందని?
అలాంటప్పుడు అతడికి తేలీకుండా
దాక్కోవడం సాధ్యమేనా?
నెవర్…!
 
దూరంగా రేడియోలో లీలగా పాట…
"నేను లేక నీవు లేవు
నీవు లేక నేను లేను
నేనెలేక నీవె లేవు
నీవెలేక నేనే లేను
లేనిచో…
ఈ జగమే లేదు..!!
 
అతండి సంగతి..అతగాడిమీద ఎంత
కోపం వున్నా 'ఎర్రబడిన కన్నులతో …
యుద్ధం చేయాలనిపించినా,,చివరకు
అతడ్ని వదిలి వెళ్ళినా…అతడు లేక
తను లేదు..అంతగా ఆమె  మనసులో
నిండిపోయాడతడు..అతడ్ని వదిలెళ్ళి,
అతనికి తెలీకుండా దాక్కోవడం అసాధ్య
మన్న సంగతి ఆమెకు తెలిసింది..ప్రేమలో
నిండా  మునిగిన వాళ్ళు వేర్వేరు కాదన్న
సంగతి ఇప్పుడామెకు తెలిసొచ్చింది..!
 
*ఎ.రజాహుస్సేన్…!!

Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!