కాఫీ విత్…ఆర్..రమాదేవి.375-రజాహుస్సేన్

*కాఫీ విత్…ఆర్..రమాదేవి.375..☕❤️

*అమ్మ..నాన్న …నేను..అతడు….కాఫీ.!!
*అమ్మకు మించిన మేధావి ఎవరుంటారు?
*అమ్మకు బాగా తెలుసు కాఫీ ఎలా పంచాలో?
కబుర్లు ఎలా కలపాలో బంధాలు  ఎలా …..
పెనవేయాలో."!

రమాదేవి గారు హైదరాబాద్లోనే వుంటున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు.
ఈ మధ్య ఫేస్బుక్లో‌ విస్తృతంగా ప్రేమ కవిత్వం రాస్తున్నారు. తనదైన ఓ ప్రత్యేకమైన డిక్షన్ ను
పట్టుకున్నారు.ఆమె కవిత్వం  చదివితే ఓ భిన్నమైన అనుభూతికి లోనవుతాం.

ప్రేమ కవిత్వం ఎప్పుడూ మనసును తడి చేస్తుంది.
హృదయానికి రిలీఫ్ ఇస్తుంది. రమాదేవి కవిత్వం..కూడా  ఇదే  కోవలో  సాగుతుంది..

"ప్రొద్దుటే ఓ కాఫీ
నాకో సగం అమ్మతో
కాస్త తీరిక సమయాన ఓ కాఫీ
నాకో సగం నాన్నతో
చల్లని సాయంకాలం ఓ కాఫీ
నాకో సగం అతనితో
అమ్మకు బాగా తెలుసు
కాఫీ ఎలా పంచాలో
కబుర్లు ఎలా కలపాలో
బంధాలు ఎలా పెనవేయాలో."!
               *రమాదేవి.!!

ఇది కాఫీ టైమ్..మీకూ..నాకూ..రమాదేవి గారికి
కూడా..అందుకే కాఫీతో మీడిపడిన రమాదేవిగారి
కవితగురించి ఈ రోజు మాట్లాడుకుందాం.!

రమాదేవి పై కవిత చిన్నదే…
జీవితం నాలుగు స్తంభాలాట…

జీవితంలో  ….
'అమ్మా..నాన్న,...తను..అతడు..
ఇప్పుడు సమస్య కాఫీది.
*అది సూర్యోదయ సమయం…
ప్రొద్దుటే ఓ కాఫీ ….వన్. బై టూ…
అమ్మతో తనకో సగం…
కాస్త తీరిక సమయాన …
మళ్ళీ వన్ బై టు….
ఓ కాఫీ …
నాన్నతో తనకో సగం..
చల్లని సాయంత్ర సమయాన….
మళ్ళీ వన్ బై టు
కాఫీ…
అతనితో…తనకో సగం…
ఇలా…కాఫీని  పంచడం..
అమ్మకూ బాగా తెలుసు…

ఒక్క కాఫీ యే కాదండోయ్..!
కబుర్లు ఎలా కలపాలో…
బంధాలు ఎలా పెనవేయాలో….
అమ్మకు బాగా తెలుసు..!

అయినా….
అమ్మను మించిన మేనేజర్ ఎవరుంటారు?
టైమ్ మేనేజ్ మెంటే కాదు…మనుషుల మధ్య
బంధాలు..అనుబంధాలు.ప్రేమాను రాగాల్ని ఎలా
పెనవేయాలో,ముడి పెట్టాలో అమ్మకు మించిన
పర్సనాలిటీ కౌన్సిలర్ ఎవరుంటారు…?
కాఫీ మాత్రమే కాదు..ఆ కాఫీతో ప్రేమను పంచడం
లో అమ్మ టైమ్ మేనేజ్ మెంట్, పంచే తీరు సృష్టిలో
మరొకరికి చేతకాదేమో? ఎవరికెంతివ్వాలి?ఎప్పుడి
వ్వాలి? ఎలా ఇవ్వాలి?

అది కాఫీయే కావచ్చు…
లేక ప్రేమాను రాగాలు కావచ్చు..‌
అమ్మకు తెలిసినంతగా …
ఇంకెవరికీ తెలీదు…
అందుకే…
అమ్మంటే..
ఎప్పుడూ స్పెషలే…అంటారు
ఆర్. రమాదేవి..‌!!

*ఎ.రజాహుస్సేన్…!!
 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!