విరంచి మీటిన మనసు విపంచి -5...నల్లమోతు శ్రీధర్

నల్లమోతు శ్రీధర్,( ఎడిటర్, కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్) ఎందుకు మానవసంబంధాలపైన ఇన్ని ఆర్టికిల్స్ రాస్తారు... అంతగా అలోచించాల్సిన అవసరం లేదు... ప్రతీవారికి చాలా వరకు తెలిసిన విషయాలే, కానీ వాటి గురించి ఎపుడు నేను ఆలోచించలేదు అని చెపుతూ తప్పుకు తిరగడం మానవ సహజ లక్ష్యం... ప్రతీ ఒక్కరు ఎక్కడో ఒకచోట ఒక సంఘటనకు స్పందిస్తారు, వారిలో ఒక మార్పుకి కారణం అవుతుంది. తను ఎంతో ఆలస్యంగా తెలుసుకున్ననేమొ అనే భావన లేదా.. ఇదివరకు తెలిసిన విషయము అయినప్పటికీ పట్టించుకోలేదన్న వాదన ఉంటుంది... అలాంటి అలోచన వచ్చినపుడు.. కొందరు వారు మాత్రమే మారతారు మరికొందరు తన వారు మారితే చాలనుకుంటారు, ఇంకొందరు సమాజమంతా మారితే బాగుందని ఆశ పడతారు, అతికొద్దిమంది  నేను చెప్పడం వల్ల ఎవరైనా మారకపొతారా అని ఆశ   పడతారు....

అతని ప్రతీ ఆర్టికిల్ ని విడివిడిగా చదివినా అన్నిటిని ఒకదగ్గర వరుసాగా పేర్చి చదివినా  వాటిలోని భావం ఏది మారదు... అన్నిటిలోను మానవసంబంధాలు మెరుగు పర్చుకుంటే బాగుంటుంది అనే ఆశ.. మానవ సబంధాలు తెగిపోకుండా ఉండాలంటే ఏమి చెయకూడదు, ఏమి చెయాలి అనే చిన్నపాటి సూచనలతోనే ముగుస్తాయి...

 

మరణం బాధిస్తుంది... కానీ వారికి శ్రద్దాంజలి ఘటించి మన పని పూర్తి అయిందంటూ తప్పుకోడం చూస్తే మరింత బాదేస్తుంది అని చెప్పిన మాటలే...
 
శ్రద్దాంజలి....
 
ఎంతో సాధించి జీవితం ముగిస్తున్న వాళ్లకు ఓ పనైపోయిందన్నట్లు RIP(rest of peace)లతో సరిపెట్టుకోవడం కన్నా..
వారి జీవితాల్ని తరచి చూస్తే జీవితం అంటే అర్థమవుతుంది.. బ్రతికితే అలా బ్రతకాలన్న స్పృహ అయినా కలుగుతుంది.
మనుషుల నుండి నేర్చుకోవలసింది చాలా ఉంది.. మన బ్రతుకు తెల్లారేలోపు మన బ్రతుకూ చాలా ఎఫెక్టివ్‌గా బ్రతకాల్సింది చాలానే ఉంది..
పోయిన వాళ్ల జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుని బాధపడడం కన్నా.. వారి జీవితాల్నిఆదర్శంగా తీసుకుని బాగుపడడం అలవాటు చేసుకుంటే బాగుంటుంది.. - నల్లమోతు శ్రీధర్
 
ఇతరులని ప్రశ్నలతో ఇబ్బందిపెట్టే వాల్లే ఎక్కువ, మనము అలాంటి జాబితా నుండి తప్పుకుందామా అని అడుగుతూనే, నీ పయణం ఎటు అనే చిన్న అలోచన రెకెత్తించాలనే ఊహతో అల్లిన చిన్న రహదారి...
 
అందర్నీ ప్రశ్నలతో నిలదీసే వాళ్లే..

విచిత్రమేమిటంటే ప్రశ్నకు సమాధానం వస్తుందన్న ఆశ ఎటూ ఉండదు.. దానికన్నా.. "తామెంత బలంగా, లాజికల్‌గా, గంభీరంగా ప్రశ్నించగలిగాం" అన్నది ప్రదర్శించుకోవడానికే చాలామంది తాపత్రయం!!

క్వశ్చన్ చేయడం ఓ గొప్ప అలవాటుగా చేయబడింది ప్రతీ ఒక్కరికీ చిన్నప్పటి నుండీ... !! సమాధానం రాకపోయినా ఫర్లేదు.. అవతలి వ్యక్తి నోరు మూయిస్తే చాలు.. ఎక్కడ లేనీ సంతృప్తీ!

అందరూ అందర్నీ ప్రశ్నించడంలో తలమునకలైపోతే సమాజానికి జవాబుదారీ అయ్యే వారెవ్వరు మిగులుతారు?

ప్రశ్నించడం కన్నా జవాబుదారీగా ఉండడం ఈ సొసైటీకి చాలా అవసరం అన్న ఆలోచన మనకెందుకు తట్టట్లేదు?

సిరివెన్నెల "నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాల్ని..." అని ఓ పాట రాసుకుంటే.. అది వినేసి... మనల్ని కాకుండా మిగతా జనాల్ని ఉద్దేశించి రాశాడనుకుని కవర్ చేసుకుంటున్నాం..

అన్నిచోట్లా మనల్ని టెక్నిక్‌గా పక్కకు తప్పిస్తే మన అస్థిత్వం ఏం మిగులుతుంది ఈ ప్రపంచంలో!!

- నల్లమోతు శ్రీధర్
 
ఎవరి జీవనశైలి వారిది, ఎవరి నడవడిక వారిది, ఎవరి వ్యక్తిత్వం వారిది.. అయినప్పటికి అందరం కలిసి ఉండడం కుదరదా అని, మీ తప్పేమి లేదు అసలు విషయం వేరే ఉంది అంటూ అలోచించడానికి వేసిన బాట..
 
ఇదన్నమాట సంగతి...

మనం నేర్చుకున్నదీ బయట జరుగుతున్నదీ ఒకదానికొకటి పొంతన లేనప్పుడే మెంటల్ స్ట్రగుల్ మొదలవుతుంది...

ఒకటి రెండు తరాల క్రితం వరకూ చిన్నప్పుడు morals చెప్పేవారు.. అంత మోతాదులో కాకపోయినా ఇప్పుడూ అక్కడక్కడ కొంతమంది పేరెంట్స్ చెప్తున్నారనుకోండి...

పిల్లల్లో మంచీ, చెడూ అనే రెండు భావాలు నాటబడతాయి... ఏది మంచీ ఏది చెడూ అన్న డెఫినిషన్లు ఒక్కో పేరెంట్‌కీ ఒక్కో విధమైన డెఫినిషన్లు ఉంటాయనుకోండి మళ్లీ.. ఆ పేరెంట్స్ చరిత్రా, ఇప్పటి వారి సోషల్ డ్రైవ్ ఎలా సాగుతోందో దాన్ని బట్టి ఈ డెఫినిషన్లలో మసాలా దినుసులు మారుతుండేవి...

సరే అదలా పెడితే.. ప్రపంచం అనేదే తెలీని వయస్సులో మంచీ.. చెడూ అనే రెండు పదాలు అలవాటు చేశాక.. పిల్లలకు సహజంగానే "ఏది మంచి, ఏది చెడూ" అని చీటికీ మాటికీ డౌట్ వస్తూనే ఉంటుంది.. పేరెంట్స్ చెప్పలేక సతమతమవుతూనే ఉంటారు.

సరే దీన్ని కూడా అలా పెడదాం...

----------------------

ఒకరికి అస్సలు డబ్బు లేని బాల్యం... మరొకరికి గొడవలు పడే తల్లిదండ్రులూ, బలంగా లేని రిలేషన్లూ... ఇంకొకరు ఏ ఢోకా లేకుండా దర్జాగా బ్రతికిన బాపతూ.. 

ఇలాంటి వ్యక్తులంతా కలిసి ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవుతూ బయట సొసైటీలో తిరుగుతుంటారు... ఎవరి ప్రయారిటీలు వారివి, ఎవరి ఆలోచనలు వారివి.. ఎవరి గోల్స్ వారివి.. పక్కోడు ఎందుకలా ముభావంగా ఉంటున్నాడో సరదాగా ఉండడమే చేతనైన వాడికి అర్థం కాదు.. ఇంకొకడు పైసా పైసా అంత జాగ్రత్తగా ఎందుకు వాడుతుంటాడో అర్థం కాక ఏదో ఒక బ్రాండింగ్ వేసేస్తాడు మరొకడు..

అలాంటి లైఫ్‌స్టయిల్స్ పక్కన పెడితే.... ఎవరి ఆలోచనలూ ఇంకొకరి ఆలోచనలకు అస్సలు match కావు కూడా ..!! 

కొందరు మోరల్స్ అంటారు.. మరికొందరు "నా ఇష్టం" వచ్చినట్లు నేనుంటానంటారు.... ఈ ఇద్దరూ ఒకర్నొకరు క్వశ్చన్ చేసుకుంటారు.. గొడవపడతారు... మనస్సు కష్టపెట్టుకుంటారూ.. ఒకరికొకరికి సరిపడదని లైఫ్ లాంగ్ దూరంగా జరిగిపోతారు.

-----------------------------

ఇప్పుడు అస్సలు విషయానికి వద్దాం...

-----------------------

అస్సలు మీరైనా, నేనైనా top to bottom మన స్వంత ప్రోడక్ట్ కాదు.. అది మనకు తెలుసు... మనం పేరెంట్స్‌చే, ఎన్విరాన్‌మెంట్‌చే, మనల్ని ఎక్కువ ప్రభావితం చేసిన లీడర్లచే, రచయితలచే, టీచర్లచే, చివరకు న్యూస్‌పేపర్లు, టివి ఛానెళ్లచే భారీగా ఇన్‌ఫ్లుయెన్స్ చెయ్యబడుతున్నాం...

సో మన ఆలోచనలు, మన అభిప్రాయాలూ మన స్వంతం కాదు.. మనం వేటినీ స్వంతంగా విశ్లేషించట్లేదు.. రకరకాల బలమైన మాధ్యమాలచే రుద్దబడిన వాటిని మోసుకు తిరుగుతున్నాం.. కాస్తో కూస్తో మేధస్సు ఉండబట్టి ఆ స్టాంప్ అభిప్రాయాలను కొద్దిగా బ్రెయిన్‌తో ప్రాసెస్ చేసినట్లు చేసి.. "ఇక నేను చెప్పేదే కరెక్ట్" అని ఫైనలైజ్ అవుతున్నాం.. అవకాశం ఉంటే టివి ఛానెళ్ల డిబేట్లలోనో... అవకాశం లేకపోతే Facebook డిస్కషన్లలోనూ ఆవేశాలు పెంచేసుకుంటున్నాం.

సో మన మంచికి ఓ ప్రామాణికత లేదు.. మన చెడుకు ఓ ప్రామాణికత లేదు... మనకు "చెడు" అన్పించిన దాన్ని చేసేవాడిని శాపనార్థాలు పెట్టుకుంటూనే మనల్ని మనం మభ్యపుచ్చుకుంటున్నాం... అలాగే మనకు మంచి అయినది ఇంకొకడికి "చెడు"గా ఎందుకు అన్పిస్తోందో, వాడి లాజిక్ ఏమిటో అర్థం కాక వాడినీ తిట్టుకుంటున్నాం...

సొసైటీ, సోషల్ రిలేషన్లలో ఇంత complexed సైకాలజీల్ని, వ్యక్తిత్వాల్నీ ప్రాసెస్ చేసి బాధపడేకన్నా ఎవరి దారిన వారిని జీవించనిస్తూ మన ఆలోచనల్ని తటస్థంగా పెట్టుకుంటూ సాగడమే మంచిది.. చాలా ప్రశాంతంగా ఉంటుంది.

- నల్లమోతు శ్రీధర్

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!