లోపలి నిధి..ది ఫైర్(the fire..venubhagavan)

పుస్తకంలోని సమాచారం చదవడం వల్ల మీ హృదయం, మెదడులోని భారమంతా తొలగింపబడి, అంతరంగం ఆనందంతో నిండి ఒక ప్రశాంతమైన, శక్తివంతమైన, ధైర్యవంతమైన రాజ దర్పంతో తలెత్తుకుని తిరిగే జీవితాన్ని సృష్టించి, జీవించాలని కోరుకుంటూ, మీ జీవితంలో ఎన్నో మార్పులకు నాంది కావాలనే ఉద్దేశ్యంతో ఈ పుస్తకం మీకు అందిస్తున్నాము. జీవితాన్ని కొత్త కోణంలో దర్శించడానికి సంసిద్ధులై ఉండండి. ముందుగా  ఈ ఆర్టికిల్   చదవండి.

లోపలి నిధి..ది ఫైర్

మనలోపల ఉన్న దానితో పోలిస్తే, మన ముందు ఉన్నది, మన వెనుక ఉన్నది, చాలా చిన్న విషయాలు - ఎమర్సన్

ఎన్నో విజయాలు సాధించిన తర్వాత కూడా అసంతృప్తికి కారణం ఏమిటి? ఏ కారణమూ లేకపోయినా ఏదో కోల్పోయిన భావన ఎందుకు? అంతా సక్రమంగా జరిగిపోతున్నా ఏదో మిస్సయిన లోటు? ఇంత సంపాదించినా ఏమీలేనట్టుగా ఎందుకు ఉంది? వారెప్పుడూ వారి మనస్సు మాట వినలేదన్నమాట.
ఒక వ్యక్తి వీధి క్రింద దేనికొసమో వెతుకుతున్నాడు. అటుగా పోతున్న ఇంకొక వ్యక్తి దేనికొసం వెతుకుతున్నారు అని అదిగాడు. 'తాళాల కోసం'! ఆ వ్యక్తి చెప్పాడు.

ఎక్కడ పోగొట్టుకున్నారు? ఆ వ్యక్తి అడిగాడు.
ఇంటి దగ్గర... సమాధానం చెప్పాడు...
మరి ఇక్కదెందుకు వెదుకుతున్నారు?...
ఎందుకంటే మా ఇంట్లో లైట్ లేదు కాబట్టి....అన్నాడు.

మనం కూడా  అంతే! లోపల పోగొట్టుకున్నదానికోసం, బయట వెతుకుతున్నాం! మనమంతా జీవితంలోని మాధుర్యాన్ని అనుభవించలేనంత యాంత్రికంగా జీవితాన్ని గడిపేస్తున్నాం! మీ బ్యాంక్ ఖాతాలో కొట్లాది రూపాయలు ఉన్నాయి, కానీ మీకా విషయం తెలియకపొతే ఏం ప్రయోజనం! తవ్వకాలు జరపంతే నిధులు ఎలా దొరుకుతాయి? మనలోపల నిక్షిప్తమై ఉన్న భాండాగారం యొక్క తాళం తెరువవలసింది మనమే.

నాకే ఎందుకు అని మథనపడే బదులు, ఎందుకు కాదు? ఏ రకంగా చేస్తే బ్రేక్ త్రూ దొరుకుతుంది? అనుకోవడం వల్ల సరైన ఆలోచనలు వస్తాయి. అడగండి- ఇవ్వబడుతుంది అన్నరు. సరైన ప్రశ్నలు, సరైన సమాధానాలను ఇస్తాయి.

జీవితం వేడి వేడి కాఫీలాంటిది. దానిని చేతితో పట్టుకుని, కిటికీ ప్రక్కన కూర్చొని కొంచెం తాగాకా...ప్చ్...చప్పగా ఉంది!...లేచి లోపలికెళ్ళి పంచదార వేసుకోవడానికి బద్ధకం... ఇష్టంలేకపోయినా అలాగే నెమ్మదిగా త్రాగేస్తారు!... అంతా త్రాగాకా చూస్తే కప్పులో అడుగున కరగని పంచదార గుళికలు ఉంటాయి.

"ఆల్ హఫీద్ అనే సంపన్న రైతు తనకున్న పొలం సాగుచేసుకుంటూ చాలా సంతోషంగా జీవించేవాడు. ఒకరోజు ఒక జ్యోతిష్కుడు అతనికి వజ్రాలగని దొరికే యోగం ఉందని దానికోసం ప్రయత్నించమని, వజ్రాలు లభ్యమైతే ఒక దేశాన్నే కొనవచ్చనీ, తన సంతానాన్నందరినీ మహారాజుల్లా బ్రతికేలా చేయవచ్చని బోధించాడు. ఆల్ హఫీద్ కి ఇది బాగా తల్కెక్కింది.

ఆ రోజు ఆల్ హఫీద్ తన పడగ్గదికి ఒక నిరుపేదలా ప్రవేశించాడు. అతను ఏదో కోల్పోయాడని బీదవాడు కాలేదు. అతను ఎందుకు బీదవాడు  అయ్యాడంటే నాకేదో తక్కువ ఉంది అనే అసంతృప్తి వల్ల. అనంతృప్తి ఎందుకు వచ్చింది అంటే నా దగ్గర ఏమీలేదు అనుకోవడం వల్ల. ఆ రాత్రి నిద్రపట్టలేదు. మర్నాడు ఉదయమే ఆ జ్యోతిష్కుడిని కలిసి తాను ఎలాగైనా అపరిమితమైన ధనవంతుడినవ్వాలని తన కోరికను వెల్లడించాడు. ఇద్దరి మధ్య సుదీర్ఘ సంభాషణ తర్వాత ఎత్తైన శిఖరాల మధ్య, తెల్లని ఇసుక మీదుగా ప్రవహించే నదుల్లో వజ్రాలు దొరుకుతాయని జ్యొతిష్కుడు చెప్పాడు. ఆల్ హాఫీద్ తన పొలం అమ్మేసి, ఆ ధనాన్ని తీసుకొని, కుటుంబాన్ని వేరొకరికి అప్పగించి వజ్రాలవేటకై బయలు దేరాడు.

సంవత్సరాల తరబడి శ్రమతో పాలస్తీనా, యూరఫ్ అంతటా తిరిగి తిరిగి వజ్రాలు లభించక చివరికి బికారిగా మారిపోయాడు. ఇక ఏమాత్రం ఆశలేని అతను స్పెయిన్ సముద్రతీరంలో అత్మహత్య చేసుకున్నాడు.

ఇదే సమయంలో ఒకరోజు ఆల్ హఫీద్ నుంచి పొలం కొన్న వ్యక్తి, తన ఒంటెకు పొలం దగ్గరలో ప్రవహిస్తున్న నీటి వాగులో నీరు త్రాగిస్తుండగా అక్కడ తెల్లని ఇసుకలో నల్లని రాయిపై సూర్యరశ్మి పడి ఇంధ్రధనుస్సు రంగులతో మెరసిపోవడం గమనించి బయటకు తీసి చూస్తే అది వజ్రం. ఆ పొలం అంతా వజ్రాలగని. అతనే దానికి యజమాని అయ్యి కోటీశ్వరుడయ్యాడు.

అదే ఆల్ హఫీద్ " తనపొలం " సాగుచేసుకుంటూ తౄప్తిగా ఉండి ఉంటే, ఒంటరితనం, బీదరికం, బికారి జీవితం, దిక్కులేని చావుకి బదులుగా ' వజ్రాలగనుల 'కు యజమాని అయి ఉండేవాడు. ఈ కథ లోని ఆశ్చ్ర్యకరమైన, దురదృష్టకరమైన నిజం ఏమిటంటే మనలో ఎంతో మంది ఆల్ హాఫీద్ లున్నారు. తనదైనటువంటి వజ్రాలగనుల కోసం తనలో తప్ప, అన్నిచోట్లా తిరుగుతూ వెతుకుతున్నారు. వజ్రాలు మనలోపలే వేచి చూస్తూ ఉన్నాయి ఒక అరుదైన ప్రతిభ రూపంలో, వాటిని పట్టి, సానబెట్టి, పాలిష్ చేయాల్సింది  ఎవరికి వారే. రోడ్డుమీద రాయిని తీసి ఎవరూ జేబులో వేసుకోరు. వజ్రం అయితే అందరికీ కావాలి.

మానవుడొక విచిత్రమైన జీవి.
అతడు హిమాలయాల ఎత్తును అధిరోహిస్తాడు.
ఫసిఫిక్ లోతుల్లోకి ప్రవేశిస్తాడు,
చంద్రుడిపైకి, అంగారకుడి పైకి యాత్రలు చేస్తాడు...
కాని ఒక్క విషయం...
ఎప్పుడూ తన అంతరంగంలోకి మాత్రం తొంగి చూడడు. - ఓషో

Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!