నిరాశ

నిరాశ గురించి చెప్పుకొబోయే ముందు మనిషి దేనికి ఆశ పడతాడో చూద్దాం. ప్రతి మనిషికీ ఆశలు ఉంటాయి. అవి ఖచ్చితంగా సొంత ఆశలే ఉంటాయి. అంటే పూర్తిగా తనకి తన కుటుంబానికి సంబ౦దించినవి. ఆ ఆశని తీర్చుకోడానికి మానవుడు శత విధాల ప్రయత్నిస్తాడు. తనకి దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటాడు. ఆ ఆశ నెరవేరని నాడు నిరాశపడతాడు. కానీ అది క్షణికం. తన గమ్యం మార్చి మళ్ళి కష్టపడతాడు.

ఇప్పుడు చెప్పబోయేది రెండవ రకమైన ఆశ. ఇలా ఆశ పడేవాళ్ళు, దాని కోసం తపించే వాళ్ళు తక్కువ మంది. వాళ్ళు కూడా దాని కోసం కష్టపడతాడు. ఇక్కడ స్వంత లాభం ఉండదు. వీళ్ళే కలకాలం చరిత్రలో నిలిచిపోతారు. వీళ్ళు సమాజం కోసం తపిస్తారు. అందులో చాలా అంశాలే ఉండచ్చు. అవినీతి, లంచం, కుంభకొణాలు, స్త్రీ సంక్షేమం, విద్య, వైద్యం, హక్కులు ఇంకా చాలా. ఇలా పోరాడినవాళ్లు చరిత్ర పేజీల్లో ఒదిగిపోయారు. మనమంతా వారి స్మృతుల్లోనే బతుకుతున్నాం. కానీ అలాటివాళ్లని తయారు చేయలేకపోతున్నాం. ఇక్కడ ఎవరి తప్పు ఉంది అనే కంటే మనం ఏ౦ చేస్తున్నామో చూద్దాం.

మామూలు మనుషులంతా ఆశ పడతారని చెప్పా కదా. మనం సమాజం గురించి కూడా  ఆలోచిస్తాం. కానీ దాన్ని సాధించడం కోసం ఏ౦ చేయాలో తెల్సినా చేయం. అందులో risk ఉంది. మరి స్వంత ప్రయోజనాల కోసం చూపించే తెగువలో risk ఉన్నా, ఫలితం వస్తుంది. అది మన కొరకే ఉపయోగపడుతుంది. ఇక దేశ ప్రయోజనం అనేది మాట్లాడుకోడానికి పనికి వచ్చే మంచి topic. అవినీతి, తీవ్రవాదం మంచి కాలక్షేప వస్తువులు. అలా అని మనలో సామాజిక బాధ్యత లేదని అనలేను. దానికి గొప్ప ఉదాహరణ "అన్నాహాజారే" చేసిన ఉద్యమానికి వచ్చిన స్పందన చూశాం కదా. మనకి ఒక నాయకుడు కావాలి. కళంకం లేని నాయకుడు, మన కోస౦ నిస్వార్దముగా పని చేసే వాడు, తన జీవితం గురించి ఆలోచించకుండా మన హక్కుల కోసం తపించే వాడు. మనం ఆవేశపడతాం, ఆయన అ౦తటీ వాడు ఇ౦తటి వాడని పొగిడెస్తాం. వీలైతే SMS చేసి మనం కూడా ఉన్నామని చెప్తాం. ఇదే పని INDIAN IDOL Program లో ఒక ప్రాంతపు కుర్రాడిని గెలిపించుకోడానికి చేస్తాం.

మనల్ని మనం సంస్కరించుకోలేనపుడు దేశం ఎలా బాగుపడుతుందో అర్ధం కాదు. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ ఎంత మంది ఈ కింద పనులు చేస్తున్నారో చూద్దాం.

1. ఓటు హక్కు ఎంత మంది వినియోగించుకుంటున్నారు. ఆ రోజు ఒక సెలవులా కాకుండా బాధ్యతగా వెళ్ళి ఓటు ఎంత మంది వేస్తున్నారు.

2. Income Tax ఎంత మంది చెల్లిస్తున్నారు.

౩. మీ చుట్టు పక్కల ప్రదేశాలని ఎంత మంది  పరిశుధ్దంగా ఉంచుతున్నారు.

4. Traffic rules ఎంత మంది పాటిస్తున్నారు.

5. మీ ఎదురుగా తప్పు జరిగినప్పుడు ఎంత మంది దానికి వ్యతిరేకంగా స్పందిస్తున్నారు.

6. మీ పిల్లలని యంత్రాల్లా కాకుండా బాధ్యతగల పౌరులుగా , సామాజిక స్పృహతో ఎంత మంది పెంచుతున్నారు. ( ఇక్కడ చాలా అనుమానాలు వస్తాయి. యంత్రాల్ల పెంచుతున్నామా? బాధ్యత నేర్పించడం లేదా అని. మీరు నేర్పేది

కుటుంబ బాధ్యత అని నా అభిప్రాయం.)

7. బ్లాక్ లో టికెట్స్ కొనకుండా ఎంత మంది సినిమా చూస్తున్నారు. దేవుడు దర్శనానికి ధర్మ దర్శనం లో ఎంత మంది వెళ్తున్నారు.


ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్ని చదివాక, వీడెవడో పాత కాలపు మనిషి లా ఉన్నడే అనుకోవచ్చు. అందుకే ఈ కాలం లో నిజమైన నాయకులు లేరు, పాత కాలం లోనే ఉన్నారు.

ప్రకృతి నాశనం అయిపోతుందని, Global Warming పెరిగిపోతుందని బాధపడుతూనే అవసరానికి మించిన వాహన వాడకం, చెట్లు నరకడం, పరిమితి కి మించిన ఇండ్ల నిర్మాణం, ప్లాస్టిక్, ఫ్రిజ్ వాడకం, నీటి కాలుష్యం ఇన్ని చేస్తూ ఈసూరో మని బతుకు ఈడుస్తూ కాన రాని భగవంతుడిని కనిపించే రాజకీయ నాయకులని అప్పుడప్పుడు మనల్ని తిట్టుకుంటూ జీవితం గడిపేస్తాం. ఎం చేయాలో తెల్సినా చేయలేని అసహాయ స్థితి (ఆది మనం కల్పించుకున్నదే). శాంతి, సంతోషం మనలోనే ఉన్నదని గుర్తించం. మనకోసం బతికే ఒక నాయకుడు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలాటి నాయకుడు ఏ రూపంలో వస్తాడో అని ఎందరో అవినీతి నాయకుల పుట్టుకకు కారణమౌతున్నాం. ఇది దారిలో ఎందరో బాబాలు, అమ్మ వార్లు మన నిరాశని సొమ్ము చేసుకొని బతికేస్తున్నారు. ఎక్కడో విన్నా " భగత్ సింగ్ పక్కింటిలో పుడితేనే బాగుంటుందని". మన విసుగు, నిరాశ తార స్థాయికి చేరి కలి యుగాంతం కోసం ఎదురుచూసినా ఆశ్చర్యపడనవసరం లేదు.


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!