మీకు నచ్చే పుస్తకం ..ఆరుద్ర వ్యాసపీఠం

ఆరుద్ర పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి (1925-98). శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగు రచయిత్రి.

ఆరుద్ర గారి ప్రముఖ  రచనలు...

  • త్వమేవాహం
  • సినీవాలి
  • గాయాలు-గేయాలు
  • కూనలమ్మ పదాలు
  • ఇంటింటి పద్యాలు
  • పైలా పచ్చీసు
  • ఎంచిన పద్యాలు
  • ఏటికేడాది
  • శుద్ధ మధ్యాక్కరలు.
    ఇంకాపరిశోధన, విమర్శలు, వ్యాసాలు.. అనువాదాలు.....

ఆరుద్రగారి పేరు తెలియని వాళ్ళు , వినని వాళ్ళు ఉంటారేమో కాని ఈ సినిమా పాటలు ఎపుడు వినలేదు అని అనేవాళ్ళు మాత్రం ఉండరు ......
1949లో బీదల పాట్లు అన్న చిత్రంలో .. " ఓ చిలుకరాజా నీ పెళ్లెప్పుడు ' అనే గీతంతో మొదలుపెట్టి దాదాపు నాలుగువేల సినిమా పాటలు వ్రాసాడు. వీటి సంకలనాలు ఆరుద్ర సినీగీతాలు అన్న పేరుతో ప్రచురితమయ్యాయి.అందులో కొన్ని ......
* పెంకి పెళ్లాం చిత్రంలో - " పడచుదనం రైలుబండి పోతున్నది " ,
* ఉయ్యాల జంపాల చిత్రంలో - " కొండగాలి తిరిగింది " , ఇదే చిత్రంలో " అందాల రాముడు ఇందీవర శ్యాముడు".
* మీనా చిత్రంలో - " శ్రీరామ నామాలు శతకోటి" .
* బందిపోటు చిత్రంలో " ఊహలు గుసగుసలాడే "
* బాలరాజు కథ లో " మహాబలిపురం మహాబలిపురం "
* ఆంధ్ర కేసరి చిత్రంలో " వేదంలా ప్రవహించే గోదావరి *
* అందాల రాముడు చిత్రంలో " ఎదగడానికికెందుకురా తొందర "
* గోరంత దీపం చిత్రంలో " రాయినైనా కాకపోతిని "
* ముత్యాల ముగ్గు చిత్రంలో "  ముత్యమంత పసుపు ముఖమెంతో చాయ"
* బాల భారతం చిత్రంలో " మానవుడే మహనీయుడు "
* ఇద్దరు మిత్రులు చిత్రంలో - " హలో హలో అమ్మాయి "
* ఆత్మ గౌరవం చిత్రంలో " రానని రాలేనని ఊరకె అంటావు. "
* ఆత్మీయులు చిత్రంలో " స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు "
మొదలగు సినిమా పాటలు వ్రాసి , ప్రతిపాటలో తన ముద్రను కనిపింపచేశాడు.
ఆరుద్ర వ్యాసపీఠం:

ఆరుద్ర వ్రాసిన ఎన్నో వాటిల్లో ఈ చిన్న పుస్తకం ఒకటి అదే ఆరుద్ర వ్యాసపీఠం.మొదటిసారి
ఆరుద్ర వ్యాసపీఠం 1985 లో అతని షష్ఠిపూర్తి సంధర్బంగా ప్రచురించారు.ఆ తరువాత ఈ పుస్తకం ప్రచురించారో లేదో తెలియదు .కానీ  ప్రతి ఇంట ఉండతగిన పుస్తకం .
ఇందులో  కొన్ని వ్యాసాలు ఆలొచింపదగినవిగా , మరికొన్ని అంతుచిక్కని ప్రశ్నలకి జవాబుగా నిలుస్తాయి.ఇందులో 39 వ్యాసాలు ఉన్నాయి.అందులో అశోకుడూ- ఆడవాళ్ళూ, కృష్ణూడూ కొట్టాడు-మత్సయంత్రం ,అన్నమయ్య ఆడినమాట....,కోహినూరు నే జడలో పూవట...పేర్లను చూడగానే మనలో చదవాలన్న ఆశక్తిని కలిగిస్తాయి.అలాగే ఏకలవ్యుడి పుట్టుపూర్వోత్తరాలు....పుత్రిక ఎలాంటి కూతురు....ఖడ్గ తిక్కన,కవి తిక్కన....మచిలీపట్నం ముందు ముచిలింద నగరమా...కృష్ణుదు అసలు సిసలు ఆంధ్రుడా....ఇలాంటివి ఎక్కడా దొరకని వ్యాసాలు.

ఆరుద్ర వ్యాసపీఠం లోని కొన్ని  వ్యాసాల వివరణలు......

ఏకలవ్యుడి పుట్టుపూర్వోత్తరాలు:ఏకలవ్యుడు నిశాడుడా? ఇతనికి పాండవులకు బంధుత్వం ఉందా ? ఏకలవ్యుడు కృష్ణుడి మేనత్త కొడుకని ,శిశుపాలుడి వలెనే ఇతను కూడా కృష్ణుడి చేతిలోనే  మరణించాడని. పాండవులు ఏకలవ్యుడు అక్క.చెల్లెళ్ళ పిల్లలని సహేతుక వివరణ ఇచ్చారు.

పుత్రిక ఎలాంటి కూతురు:అన్నదమ్ములు లేని అమ్మాయిని ఏమని పిలవాలి. కూతురుకి వాడే ఇతర పర్యాయపదాలు ఏంటి ? కూతురిని పుత్రిక అంటే దోషమా ? వీటికి సమాధానమే ఈ వ్యాసం

ఖడ్గ తిక్కన,కవి తిక్కన:తిక్కన ఈ పేరు తెలియని వారు ఉండరు కానీ  ఇందులో చాల మందికి ఎప్పటికి తీరని  సందేహమే కవిగారు ఐన తిక్కన ఎందుకు యుద్దానికి వెళ్లారు అని ..అసలు వీళ్ళుఇద్దరు  ఒకటా లేక వేరు వేరా అన్న అనుమానం అందరికి ఉండనే ఉంది వీరి మధ్య ఏమైనా బంధుత్వం ఉందా అన్నదానికి సమాధానమే ఈ  వ్యాసం.

కృష్ణూడూ కొట్టాడు-మత్స్యయ౦త్ర౦:తొమ్మిదో ఏషియాడ్  సందర్బంగా మన తంతి  తపాలా శాఖవారు  ఒక స్టాంపు విడుదల చేసారు.ఇందులో శ్రీకృష్ణుడు మత్స్యయంత్రాన్ని కొడుతూ ఉంటే అర్జునుడు ప్రేక్షక మహాశయునిగా   చూస్తూ చూస్తూ నిలబడ్డట్టు చిత్రకారుడు చిత్రించాడు .ఈ బొమ్మ ఆక్షేపణకు గురైంది ...అది నిజమే నంటూ తెలియచెప్పే వివరణ ఉంది.

పెద్దబాలశిక్ష :ఒక ప్రతీక్ష:1847 లో మొదటిసారి అచ్చుపడింది .ఆ తరవాత 1856 లో బాలశిక్ష  అన్న పేరుతో ముద్రింపబడింది.దీనికి పెద్ద బాలశిక్ష అన్న పేరు  ఎపుడు వచ్చింది ఎన్నిపుటలు ఉన్నాయి ఇందులో అన్న వివరణ ఇచ్హారు.

ఇలా ఎన్నో వివరణలతో  అందరికి అర్ధం అయ్యే విధంగా ,సాహిత్య వ్యాసాలు చదువుతున్నట్టు ఏదో అందమైన తెలియని ప్రపంచాన్ని చూస్తున్నట్టుగా ఉంటుంది ....ఆరుద్ర గారి ఈ వ్యాసపీఠం.


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!