అలనాటి స్మృతులు - "చల౦ మైదాన౦" (కష్టపడి ఇష్టపడ్డాను)

ఒకరోజు అలా ఒకరింటికి వెళితే అక్కడ చలంగారి మైదానం కనిపించింది. ఏంటి మైదానం ఎవరు కొన్నారు అని అడిగాను ఆత్రుతగా.. అంతే అమ్మో అక్క ఏంటి ఆ నవల అలా ఉంది, ఎలా రాసాడో అంది. ఎందుకో నా మనసు నొచ్చుకుంది ఎక్కడో. 'అది ఇపుడు రాసింది కాదు. ఆ నవల 1927 లో వ్రాసారు' అని చెప్పాను తనకి. అవునా అని ఆశ్చర్యం ప్రకటించింది. ఆమె సంగతి ఏమొ కాని, నన్ను మాత్రం ఆ మైదానం అందుకోడం వెనుక ఉన్న జ్ఞాపకాలు చుట్టూముట్టాయి.

నేను హైస్కూలు లో ఉన్నప్పటి సంగతి....ఏదో నవల చదువుతూ ఉన్నా అందులో ఒకచోట హిరోయిన్ చదువుతున్న నవల చూసి హీరోగారు "ఏంటి ఇది పెళ్ళి కాని ఆడపడుచులున్న ఇల్లు నీ పట్నం వేషాలు ఇక్కడ వేయకు అని తిట్టి.  ఆమె చేతిలోని మైదానం నవలను విసిరికొడతాడు". ఇలా ఉంది అందులో. పేరున్న కవి పుస్తక౦ గురి౦చి అలా ఎందుకు అన్నాడా అని, అపుడు మొదలైంది నాలో మైదానం చదవాలని..

మాకు దగ్గరలో ఒక రెంటెడ్ లైబ్రరి ఉండేది.ఒకరోజు స్కూలునుండి వస్తూ మీదగ్గర చలంగారి మైదానం ఉందా అని అడిగాను.నా ప్రశ్న విని స్కూలుడ్రెస్సులో ఉన్న నన్నూ చూసి కాబోలు కొంచెం గట్టిగా "అలాంటివి ఇక్కడ ఉండవు  అన్నాడు"అతను నాతో అన్న విధానం నన్ను ఎంత భయానికి గురి చేసాయి అంటే స్కూలు నుంచి వచ్చేదారినే మార్చేసుకున్నాను అంతే కాదు ఆ పుస్తకాన్ని గురించి ఎవరిని అడగడానికి కూడా ధైర్యం సరిపొలేదు. ఆ పుస్తకంపై ఆశ మది అడుగు చేరింది.

తరవాత నేను డిగ్రీకాలేజిలో చేరాను. అక్కడ కాలేజి లైబ్రరి చూడగానే  నా ఆశ మళ్ళీమొగ్గ తొడిగింది. అలా పది రోజులు లైబ్రరిలో గడిపి ఆ తరవాత మా లైబ్రేరియన్ని అడిగాను చలం మైదానం ఉందా అని....అవి మీకు అవసరం లేదమ్మా అని ...ఈ అమ్మాయికి మైదానం కావలంటండి అని చెప్పి నవ్వింది... అంతే మొగ్గ లాంటి ఆశ అలానే ఉండిపొయింది.

నా సెకండ్ లాంగ్వేజి తెలుగు ఐతే నా ఫ్రెండ్ ది హిందీ. మేము స్టెట్ లైబ్రరి కార్డ్స్ తీసుకున్నాం. ఇక అక్కడ మొదలయ్యాయి నా పాట్లు. వెళ్ళడం... ఎవో పుస్తకాలు తెచ్చుకోవడం... వెతికితే దొరకదు... అడగాలంటే భయం... అతనే అడిగాడు నా ఇబ్బంది చూసెమొ ఏ పుస్తకం కావాలో చెపితే ఉందో లేదో చెపుతాను అన్నాడు.
లోపల బెదురు ఉన్నా..."చలం మైదానం అన్నా విని వినబడనట్టు". చిన్ననవ్వు నవ్వి చలంగారివన్ని ఆ చివరివరసలో ఉంటాయి చూసుకో అన్నాడు. అబ్బా ఆ మాట నాకు మండువేసవిలో చిరుజల్లులా తగిలింది. అలా నా ఆశ, ఆరాటం చేతికందింది.

ఇపుడు పుస్తకాన్ని ఎలా చదవాలి...నా చేతిలో ఈ నవల చూసి ఎమైనా అంటారేమొ అన్న బెదురు. చదవాలన్న ఆరాటం... ఎలాగైతేనేం భయం భయంగానే పూర్తి చేశా చలంగారి మైదానం. నిజం చెప్పలంటే చదివాను అనే కాని, కథ ఏమి నా బుర్రని చేరనే లేదు.

ఆ తరవాత చలంగారి పుస్తకాలు అన్ని చదివాను. అతనిపై విమర్శలు చదివాను. నాకు ఎంతో నచ్చారు చలం. కాని ఇప్పుడు ఎక్కడైనా చలం పేరు వినగానే అతని కథలతోపాటు, మైదానం కొసం నేను పడ్డ ఇబ్బంది గుర్తొస్తుంది.


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!