సర్వం కోల్పోవడం ఏమిటో తెలుసుకోనివ్వు

నులివెచ్చని సూర్యుడు
చల్లని చిరుగాలులు... కిలకిల రావాలు
నక్షత్రాల్లా చినుకు చినుకుగా రాలే వాన

ఏ ఒక్కటి మనసు వరకు చేరి
నన్ను కౌగిలించుకోవడం లేదు....

మనసుకెందుకో యాతన
విధ్వంసాన్ని సృష్టించే
వాన కోసం ఎదురుచూపు...
శరీరాన్ని బాధించే చిక్కని చలికై
మరి మరి వెతుకులాట...

నాకు నేనుగా నష్టాన్ని కలిగించుకోలేను
నీవు నాకోసం విధ్వంసాన్ని సృష్టించు
నీవు ఈ ఆటలో భాగస్వామివే కదా
సర్వం కోల్పోవడం ఏమిటో తెలుసుకోనివ్వు

ఓయ్
ఇప్పుడు పూర్తిగా
ఓ కథ రచించబడింది...

నీకై
కొత్త దారిలో వెతుకులాటకు
శ్రీకారం చుట్టబడింది


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!