నువ్వు కావాలి

జలపాతం లాంటి నీ రాకతో
ఆలోచన కోల్పోయే నన్ను 
గుర్తించడానికి నువ్వు కావాలి

మాట తూలి సరిదిద్దుకోలేక మిగిలిన
నన్ను మాట్లాడించడానికి నువ్వు కావాలి

ప్రేమించడానికి నీ అనుమతి అక్కర్లేదు అని
నీకై నలువైపులా వెతికే కళ్ళకు నీవు కావాలి

నువ్వు కనపడకపోతే ఆగమైపోతాను అంటూ 
మాట వరసకు పలకని నిశ్శబ్దానికి నీవు కావాలి

నీ మాట వినబడక... నీవు కనపడకపోతే
మనసు బరువెక్కి చిత్రమైపోతుందన్న
రహస్యం దాచిన అరకు నీవు కావాలి

నిజంగా
నీ నుండి నువ్వు
తప్పిపోయిన నువ్వు కావాలి


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!