పంతాల పిల్లతో పందెం ఏమిటో

How can you escape....
You will be loved more ...
IN SILENCE ❤️

అతనన్నాడు...
నాతో మాట్లాడకుండా
వారమైనా ఉంటావటోయ్
అయినా ...
ఎలా ఉంటావులే
ఒకింత ఆశ్చర్యంగా
చివురంత మురిపంగా అడిగాడు...

అబ్బో
రాజా వారికి ప్రశ్నించడం వచ్చింది
ఇప్పుడు జవాబులు చెప్పడం నావంతా
పెంకిపిల్ల అని తెలిసి ఆ తెంపరితనం ఏమిటో...

సరేలే
వెతికి వెతికి నిశ్శబ్దాన్ని
అరువు తెచ్చుకుంటాలే
పలికే మాటకు తాళం వేసి
మరింత ప్రేమించడం నేర్చుకుంటాలే

అయినా ...ఇపుడు
నా కథ ఎందుకులేవోయ్
నీ కథ తేల్చవోయ్..

మాట్లాడని నాతో
మరింత చిక్కగా చిక్కుకుపోకుండా
కొత్తగా ఏదైనా మంత్రమో తంత్రమో
కాస్త అలవాటు చేసుకో... మరి
పంతాల పిల్లతో పందెం వేసావుగా

ఓయ్
ప్రశ్న నువ్వు వేసి
రాక్షసి అని నన్ను అనకు
ఏదేమైనా నీ నీడను కదా...
ఏమంటావ్.......


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!