ఓయ్... అన్ని నీవే

ఓయ్

నిదురించే వేళ
నీ చేతికి గోరింటాకు పెడితే

పండిన నీ చేతి గురించి చెప్పుకునే
నీ మాటలు ఎవరికి ఎన్నో......

వెతికే నీ చూపులకు చిక్కగా
పారిపోయే నా అడుగుల దూరం ఎంతో...❤️

***********

నాకు నేనై మిగుల్చుకొని నాకోసం
సమయం దాచపడుతుంది

అతను యే వేళ వస్తాడో గానీ
నా సమయం దొంగిలించబడుతుంది

ఇప్పుడు మరింత శ్రద్ధగా
సమయం దాచపడుతుంది
నాకోసం.... అచ్చంగా నా కోసమే

********

నాలోని లోలోపలి రహస్యాలను
మోహపుగీతాలుగా ఆలపించి

నన్ను
అగాధపు జలపాతంలా
మార్చి వేయకు


 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!