ఎదురు రారాదు.. ..please

అలకబూనిన మనసు అదుపు తప్పి
నిన్ననో..మొన్ననో అనరాని మాటలేవో జారవిడిచి

గుబులు మొత్తాలు మూటకట్టు కొచ్చి
మరువలేని శిక్ష లేవో వేయమంటూ..
అల్లిబిల్లి ఆలోచనలతో నన్ను అల్లుకుంది

అతను నిండిన మనసుకు
పరుషమేల తాకేనంటు....

మనసును పొడిపొడిగా చేసి
గురుతుతెలియని చోట వదిలేసి రమ్మని..
అంతుతెలియని చోట విసిరి రమ్మంటూ
నాలోని నన్ను నిలదీస్తూ... పోరు పెట్టింది..

నాలోని..  నీనేను నిలువెల్లా నీరై
అణువణువు కరుగుతూ ..
అలిసిపోతూ ఆరాటపడుతూ
నీ ప్రాణంలో ప్రాణంమవ్వాలని
నీకై పరుగులు పెడుతున్నా

ఓయ్...
ఎదురు రారాదు.. please
ఒక అడుగు ఇటు వేసి
అలసిన మనసును సేద తీర్చ


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!