మాట్లాడాలని.........❤️

నీతో మాట్లాడాలని ఉంది పదం పదం కలుపుతూ వాక్యాలన్నీ పోగుచేసి ఆగకుండా మాట్లాడాలని ఉంది నీతో.. అయినా నాలోని మాటలు నీవైనప్పుడు.. నీలోని కొంత నా దగ్గర ఉందనుకున్నప్పుడు.. ఏమని మాట్లాడను.. మాటలంటూ ఉన్నాయా... నేనంటూ మిగిలానా

క్షణం క్షణం కాలంఒడిలో "నువ్వు ' నాకు అనంతమై.. "నేను' అనే ఆనవాలు ఆచూకీ లేకుండా పోయింది....

నీవు ఒక రంగు రంగుల సప్తవర్ణం అని పదే పదే చెబుతాను కానీ అన్ని రంగుల్లో ఆనవాళ్లు ఎరుక పరచని తెలుపునై నీలో చిక్కుబడిపోయాను..

నేనెక్కడు కొండ గాలి వాటంగా ఉన్నప్పుడు.. నీలోని ఏ రంగు నాపై చల్లి వెళ్లావు... ఏ ఆనవాలు నాలో దాచి వెళ్లావు...

ఒకసారి నా నీడ నీదిగా ఉంది... మరోసారి నీ నిదుర సగం నాది అయింది... ఒక్కొక్కప్పుడు నీ మౌనంలో నా చిరునవ్వు ఒదిగిపోయింది.. నేనంటూ ఉన్నానా... నిన్ను కలుపుకొని అనంతానయ్యానా.. ఇతిమిత్తంగా తేల్చుకోవాలని లేదు...

ఏమని చెప్పేది.. నన్ను నేను ప్రేమిస్తున్నానో... నాలోని నిన్ను పెనవేస్తున్నానో...

నీ అడుగుల ఆనవాలు వెతకాలని ఉంది ...ఈ వెతుకులాటలో నేను తప్పిపోవాలని ఉంది... నీతో మాట్లాడాలని ఉంది.. మాటలు అందని మౌనంలో ఒదిగి పోవాలని ఉంది... నాకు నేను ఎరుకలేకుండా పోతున్నాను.. బహుశా నీకు నేను అర్థం అయ్యానని కాబోలు....


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!