మోహపుగీతాలు ఆలపించబడుతూనే ఉంటాయి..

నీవు ఎక్కడో దూర ప్రయాణంలో
ఉన్నావని తెలుసు ..

అయినా ..
నా ఇంటి ముంగిట
నీకై ఎదురు చూస్తుంట...

మరెప్పుడో మా వీధివెంట వెళతావు
అప్పుడు ఏ నదీతీరానో నీకై
మోహపుఛాయలో నిలిచి ఉంటా..

ఎపుడో
తెలిసి తెలియక నీతో
దాగుడుమూతలు ఆట మొదలెట్టా..

ఇప్పుడు
నీవు నడిచిన దారులు
నేను నడిచిన దారులు
ఒకదానితో ఒకటి పెనవేసుకొని
చిట్టడివిని మరిపిస్తున్నాయి..

నా చుట్టూ అనంతమైనదారులే
ఏ దారిలో నేను నిన్ను చేరాలో
బహుశా
నేను అడవిలో తప్పిపోయాను కాబోలు..

ఇక ఎప్పటికీ
నీకై మరిన్ని మోహపుగీతాలు
ఆలపించబడుతూనే ఉంటాయి..


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!