మా వీధి మలుపులో నీ ఆనవాలు పసి కడితే చాలు
నా కాళ్ళు ఎందుకో చల్లబడతాయి
వీధి వైపుకు అడిగేయ మొరాయిస్తాయి....
బహుశా
నీ చూపులతో పెనవేసికొని
విడదీసుకోలేనని బెదురు కాబోలు..
మా వీధి వాకిట నీ మాట విన్నంతనే
నా గొంతు ఎందుకో తడారిపోతుంది
మాట మూగనోము పడుతుంది
బహుశా
నీతో మాట కలిపితే
విడివడలేనని దిగులు కాబోలు
నిద్రించే సమయాన
నీ జ్ఞాపకం ఒకటి చెంత చేరితే
ఆ రాతిరంతా జాగారమే
బహుశా
కలగా వచ్చి కనుమరుగు కాకుంటే
నీ దానినైపోతానని అలజడి కాబోలు
ఎందుకోనోయ్
నీవు నా మోహపు సోయగం అని
మాటిమాటికి అంటాను కానీ
నీ చెంతచేర కాస్త బుగులేనోయ్....