నిదురలెండి నిదురలెండి
నిండు సూర్యుడు మీకోసం వస్తున్నాడు
అలసి సొలసి, ఆదమరచి
నిరాశ నిషాలో నిశీధిలో
నిద్రిస్తున్న మీ జీవితానికి
వెలుగుతో కొత్త ఉత్తేజాన్ని,
ఉత్సాహంగా ఉరకలేస్తూ తెస్తున్నాడు,
కలికాలనికి కోక్కరో కోడి కాస్త కంగారు పడుతుంది
నిదురలెండి నిదురలెండి !!
గోవు పాలతో గోపుడు గుమ్మం ముందు నిల్చున్నాడు ,
గంగామయిల గంగిరెద్దు గడప గడప తిరుగుతుంది,
పక్క గుడిసె పంకజాక్షి పూల ముగ్గులు పరుస్తుంది,
తాజా వార్తల దిన పత్రిక తలుపు సందున తొంగి చూస్తుంది,
నిదురలెండి నిదురలెండి !!
జన సాగరంలో స్వార్ధపు అలలు ఎగసి పడుతున్నాయి
అవినీతి పొగమంచులో, నీతి కనుమరుగై పోతు౦ది
ఆత్మీయత ఎ౦డిపోయిన చెరువులో పగులు బారిన మట్టిగా మారుతుంది
మత్తును వీడి విపత్తును ఎదుర్కోండి
నిదురలెండి నిదురలెండి.....!!!
-సంపత్ కుమార్.