నువ్వు హఠాత్తుగా ఎదురైతే ఏమవుతుంది
గుండె లయ తప్పుతుందా.. స్పృహ తప్పి పోతానా
ఏది కాదేమో
నిన్ను తట్టి లేపిన జ్ఞాపకంపై కన్నెర్ర చేస్తాను
ఇటువైపు రాక కోసం ఎంత సమయాన్ని పోగొట్టుకున్నావోనని తల్లడిల్లుతాను
నన్ను నేను నిందించుకుంటాను
నీ రాకను పసికట్టలేని
నా మనసుపై నమ్మకం కోల్పోతాను..
ఓయ్ ...
రారాదూ ఓ క్షణమైనా...
ప్రేమించే గుణం కొదవబడిందేమో
లెక్క సరిచేసి పోరాదు..