అదేమిటో హఠాత్తుగా
సమయంతో పాచికలాడుతున్నట్లుంది
అప్పుడెప్పుడో జరిగిపోయిన
చాలా రోజుల కిందటి నిన్న
ఈ రోజులా కనిపిస్తుంది
అసలు నిన్న...రేపటిగా అనిపిస్తుంది
అంతా తెలిసిపోయినట్టుగా ఉంటుంది
చాలా జన్మలు గడిచిపోయినట్టుంది
మరోసారి జీవిస్తున్నట్టుగా ఉంది
కాలం
మరింత సాగిపోయినట్టుగా అనిపిస్తుంది
అచ్చంగా
అతను పూర్తిగా నాతో ఉన్నట్టుగా ఉంది
గాలి జొరబడని గాఢత అల్లుకుంది
ఓయ్
ఇంతకీ .....
సమయం అంటే నువ్వేనా
నిజం చెప్పు.......